NCB Aryan Khan : నవాబ్ మాలిక్ చెప్పిందే జరిగింది
ఆర్యన్ ఖాన్ కు క్లీన్ చిట్ పై ఎన్సీపీ
NCB Aryan Khan : దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన ముంబై డ్రగ్స్ కేసు వ్యవహారంలో ప్రముఖ నటుడు షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కు ఎన్సీబీ ప్రత్యేక కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది శుక్రవారం.
ఈ మేరకు మొదటి నుంచీ కుట్ర పూరితంగా ఆర్యన్ ఖాన్(NCB Aryan Khan) ను ఇరికించారంటూ ఎన్సీపీ ఆరోపిస్తూ వచ్చింది. ఇటీవల మనీ
లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన మంత్రి నవాబ్ మాలిక్ సంచలన ఆరోపణలు చేశారు.
ఆయన ప్రధానంగా ఎన్సీబీ(NCB) ఆఫీసర్ గా ఉన్న సమీర్ వాంఖెడేను టార్గెట్ చేశారు. కావాలని కేసు నమోదు చేశారని, ఇదంతా ఏదో ఒకరోజు
తప్పు అని తేలుతుందని కుండలు బద్దలు కొట్టారు.
చివరకు కోర్టు ఆర్యన్ ఖాన్ కు క్లీన్ చిట్ ఇచ్చింది. మిగతా వారికి డ్రగ్స్ తో సంబంధం ఉందంటూ తీర్పు చెప్పింది. మహారాష్ట్ర ప్రభుత్వంలో
భాగస్వామిగా ఉంది శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ పార్టీ.
ఆర్యన్ ఖాన్ కు క్లీన్ చిట్ ఇవ్వడాన్ని ఆ పార్టీ స్వాగతించింది. కాగా ఈ మధ్య కాలంలో షారుక్ ఖాన్ ఫ్యామిలీ అనుభవించిన మానసిక క్షోభకు ఎవరు బాధ్యత వహిస్తారని, కోల్పోయిన పరువును ఎవరు భర్తీ చేస్తారని ఎన్సీపీ ప్రశ్నించింది.
ఇదిలా ఉండగా డ్రగ్స్ కలిగి ఉన్నాడంటూ సమీర్ వాంఖెడే సారథ్యంలో కేసు నమోదు చేశారు. గత ఏడాది 2021 అక్టోబర్ 3న అరెస్ట్ చేశారు.
కోర్టు జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత బెయిల్ పై విడుదల అయ్యారు.
విచారణ సందర్భంగా ఆర్యన్ ఖాన్ కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలను ఎన్సీబీ సమర్పించ లేక పోయింది ప్రత్యేక కోర్టులో. దీంతో కేసు కు సంబంధించి ఖాన్ కు లైన్ క్లియర్ ఇచ్చింది.
మరాఠా సంకీర్ణ సర్కార్ ను కూల దోయడంలో భాగంగానే ఈ కేసులో ఇరికించారంటూ ఎన్సీపీ నాయకుడు క్లైడ్ కాస్ట్రో ఆరోపించారు.
Also Read : సమీర్ వాంఖడే పై బిగుస్తున్న ఉచ్చు