Nayan Vignesh Parents : పేరెంట్స్ గా మారిన నయన్..విఘ్నేష్
కవలలను స్వాగతించిన సెలెబ్రిటీస్
Nayan Vignesh Parents : తమిళ సినీ రంగానికి చెందిన నయనతార, విఘ్నేష్ శివన్ లు ఇటీవలే పెళ్లి చేసుకున్నారు. గ్రాండ్ గా జరిగింది వీరి వివాహం. భారీ ఖర్చుతో భవనాన్ని కూడా కొనుగోలు చేశారు. తాజాగా మరో సంచలన అంశం పంచుకున్నారు. నయన్ , విఘ్నేష్ అమ్మ, అప్పగా(Nayan Vignesh Parents) మారారు.
ఈ సంవత్సరంలో వీరి నుంచి ఇలాంటి న్యూస్ వినడం ఇదే మొదటిసారి. ఈ ఇద్దరు నటీనటులు కవల పిల్లలను స్వాగతించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. కాగా కవల అబ్బాయిలను సరగోసీ ద్వారా స్వాగతించారు.
దీనికి సంబంధించి ప్రస్తుతం వైరల్ గా మారాయి ఫోటోలు. ఈ సందర్భంగా విఘ్నేష్ శివన్ ప్రత్యేకించి తన సోషల్ మీడియా ఖాతాలలో ఈ ఇద్దరి కవల పిల్లల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. విశేషాలను తెలియ చేశారు. ఇలా రాశారు. నయన్ నేను అమ్మ, అప్పగా మారామని పేర్కొన్నారు.
మా ప్రార్థనలు ఫలించాయి. మా పూర్వీకుల దీవెనలు మాకు అందాయి. అభిమానుల ఆదరాభిమానాలు, మా ప్రయత్నం వల్లే ఇదంతా జరిగిందని తెలిపారు విఘ్నేష్ శివన్. ఆయన తమిళంలో ఇలా పేర్కొన్నారు. మా ఉయిర్ , ఉలగం కోసం మీ అందరి ఆశీస్సులు కావాలని కోరారు నటి నయనతార.
కొన్నాళ్లు డేటింగ్ చేసిన నయనతార, విఘ్నేష్ శివన్ ఎట్టకేలకు జూన్ 9న మహాబలిపురంలోని ఓ రిసార్ట్ లో పెళ్లి చేసుకున్నారు. నానుమ్ రౌడీ ధన్ సినిమా షూటింగ్ లో ఉండగానే ఈ జంట ప్రేమలో పడింది. రెండేళ్ల తర్వాత జరిగిన ఓ అవార్డు ఫంక్షన్ లో జంటగా కనిపించారు.
Also Read : డిప్రెషన్ అన్నది కనిపించని రోగం – దీపికా