NCW Case : మ‌న్సూర్ పై మహిళా క‌మిష‌న్ ఫైర్

చ‌ర్య‌ల‌కు సిఫార‌సు చేసిన చైర్ ప‌ర్స‌న్

NCW Case : న్యూఢిల్లీ – జాతీయ మ‌హిళా క‌మిష‌న్ సీరియ‌స్ కామెంట్స్ చేసింది. ప్ర‌ముఖ త‌మిళ సినీ న‌టి త్రిష‌పై అనుచిత కామెంట్స్ చేశారు న‌టుడు మ‌న్సూర్ అలీ ఖాన్. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై తీవ్ర దుమారం చెల‌రేగింది. దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్తం అవుతోంది. ఇదే స‌మ‌యంలో టాలీవుడ్ న‌టుడు నితిన్ రెడ్డి సైతం మండిప‌డ్డారు. మ‌న్సూర్ చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపాయి.

NCW Case on Tamil Actor

ఈ మేర‌కు జాతీయ మహిళా క‌మిష‌న్ నోటీసులు జారీ చేసింది. ఎందుకు చర్య‌లు తీసుకోకూడ‌దో వివ‌ర‌ణ ఇవ్వాల‌ని స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. మ‌హిళ‌ల ప‌ట్ల ఒక బాధ్య‌త క‌లిగిన న‌టుడు ఇలా మాట్లాడ‌టం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించింది.

ఇదిలా ఉండ‌గా మ‌న్సూర్ అలీ ఖాన్(Mansoor Ali Khan) పై ఐపీసీ సెక్ష‌న్ 509బి, ఇత‌ర చ‌ట్టాల కింద కేసు న‌మోదు చేయాల‌ని త‌మిళ‌నాడు డీజీపీని ఆదేశించింది క‌మిష‌న్. ఇలాంటి అనుచిత వ్యాఖ్య‌లు చేసే వారిని ఓ కంట క‌నిపెట్టి చూడాల‌ని స్ప‌ష్టం చేసింది. ఏ మాత్రం వీరికి మ‌హిళ‌ల ప‌ట్ల గౌర‌వం లేద‌ని వాపోయింది.

అయితే చాలా సినిమాల‌లో తాను రేప్ సీన్స్ చేశాన‌ని, చాలా మంది హీరోయిన్ల‌ను బెడ్ రూమ్ లోకి తీసుకు వెళ్లాన‌ని అన్నాడు. లియో సినిమాలో కూడా త్రిష‌తో అలాంటి సీన్ ఉంటుంద‌ని అనుకున్నాన‌ని కానీ లేక పోయేసరికి నిరాశ కు లోనైన‌ట్లు తెలిపాడు.

Also Read : CM KCR : ఆటో డ్రైవ‌ర్లకు ఖుష్ క‌బ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!