Neeraj Chopra : నీరజ్ చోప్రా అరుదైన ఘనత
రెండో భారత ఆటగాడిగా రికార్డ్
Neeraj Chopra : జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా (Neeraj Chopra) అరుదైన ఘనత సాధించాడు. ఒలింపిక్స్ లో స్వర్ణ పతకాన్ని సాధించి పెట్టిన ఈ క్రీడాకారుడు తాజాగా వరల్డ్ ఛాంపియన్ షిప్ జావెలిన్ త్రో లో తృటిలో స్వర్ణం కోల్పోయాడు. రజత పతకం సాధించాడు.
రెండో భారత ఆటగాడిగా అరుదైన ఘనత వహించాడు. ఆదివారం జరిగిన ఫైనల్ లో 88.13 మీటర్ల త్రో తో రెండో స్థానంలో నిలిచాడు. సిల్వర్ మెడల్ తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇక ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో 2003లో భారత లాంగ్ జంపర్ అంజూ బాబి జార్చ్ కాంస్య పతకం గెలుచుకుంది. దాదాపు 19 ఏళ్ల తర్వాత మరో భారతీయుడు చరిత్ర సృష్టించడం విశేషం.
ఈ విజయంతో దేశ వ్యాప్తంగా సంబురాలు చోటు చేసుకున్నాయి. అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. చోప్రా స్వంతూరు హర్యానా లోని పానిపట్. ఒలింపిక్స్ లో తొలి బంగారు పతకాన్ని సాధించిన అథ్లెట్ గా పేరొందాడు.
ఇండియన్ ఆర్మీలో జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్ గా ఉన్నాడు. 2016లో ప్రపంచ అండర్ -20 లో 86.48 మీటర్ల త్రో సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
14 జూన్ 2022న ఫిన్ లాండ్ లోని తుర్కులో జరిగిన పావో నూర్మి గేమ్స్ లో 89.30 మీటర్ల త్రో కొత్త జాతీయ రికార్డు నెలకొల్పాడు.
15 రోజుల తర్వాత 30 జూన్ 2022న స్వీడన్ లో జరిగిన స్టాక్ హోమ్ డైమండ్ లీగ్ లో 89.30 మీటర్ల త్రోతో జాతీయ రికార్డు బద్దలు కొట్టాడు నీరజ్ చోప్రా .
Also Read : నీ విజయం దేశానికి గర్వ కారణం