Neeraj Chopra Salute : ఆడబిడ్డల విజయం చోప్రా సలాం
మీ గెలుపు దేశానికి ఆదర్శ ప్రాయం
Neeraj Chopra Salute : భారత దేశం మిమ్మల్ని చూసి గర్విస్తోంది. ఒక రకంగా మువ్వెన్నల పతాకం మురిసి పోతోంది. 140 కోట్ల భారతీయులంతా ఒక్కసారిగా మీరు సాధించిన అద్భుత గెలుపును హత్తుకుంటున్నారు. మీకు జేజేలు పలుకుతున్నారు. మీ ప్రతిభకు, మీ శ్రమకు తగిన ఫలితం దక్కింది.
మీ అందరికీ శిరస్సు వంచి సెల్యూట్ చేస్తున్నానని ప్రకటించారు జావెలిన్ త్రో విన్నర్ ఒలింపిక్ బంగారు పతక విజేత నీరజ్ చోప్రా. ఆయన సలాం చేస్తున్నది ఎవరినో కాదు అండర్ 19 మహిళా క్రికెట్ జట్టు సభ్యులందరికీ(Neeraj Chopra Salute).
ఈ దేశంలోని క్రీడాకారులందరికీ మీరు స్పూర్తి దాయకంగా నిలిచారని కొనియాడారు. దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన అండర్ 19 ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆధ్వర్యంలో తొలిసారి నిర్వహించిన వరల్డ్ కప్ ను అండర్ 19 భారత మహిళా జట్టు కైవసం చేసుకుది.
ప్రత్యర్థి ఇంగ్లండ్ జట్టును మట్టి కరిపించింది. తక్కువ స్కోర్ కే కట్టడి చేసింది. 68 పరుగుల టార్గెట్ ను కేవలం 14 ఓవర్లలోనే సాధించింది.
విశ్వ విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ , బీసీసీఐ చీఫ్ రోజర్ బిన్నీ, కార్యదర్శి జే షా తో పాటు పలువురు ప్రముఖులు అభినందనలతో ముంచెత్తారు.
ఇదిలా ఉండగా నీరజ్ చోప్రా ఫైనల్ కంటే ముందు నుంచీ మహిళా జట్టును ప్రత్యేకంగా ప్రోత్సహిస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన చేసిన కామెంట్ ఇప్పుడు వైరల్ గా మారింది. నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
Also Read : యుజ్వేంద్ర చాహల్ కమాల్