Neeraj Chopra Celebration : చోప్రా విజయం అంతటా సంబురం
స్వంత స్థలంలో ఆనందం..సంతోషం
Neeraj Chopra Celebration : యావత్ భారతావని మరోసారి పొంగి పోతోంది. భారతీయ అథ్లెట్ నీరజ్ చోప్రా ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భాగంగా జరిగిన జావెలిన్ త్రో విభాగంలో తృటిలో స్వర్ణం కోల్పోయాడు.
కానీ రజతం (సిల్వర్) పతకాన్ని సాధించాడు. రెండో భారతీయ క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాడు. ఇప్పటికే ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించిన ఈ అథ్లెట్ మరోసారి భారతీయ మువ్వొన్నెల పతకం ఎగుర వేసేలా చేశాడు.
భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ , కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ , కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజుతో పాటు పలువురు ప్రముఖులు అభినందనలతో ముంచెత్తుతున్నారు.
ఇక నీరజ్ చోప్రాకు చెందిన స్వంత ఊరు పాని పట్ లో పెద్ద ఎత్తున సంబురాలలో మునిగి పోయారు. ఆనందంతో కేరింతలు కొడుతూ డ్యాన్సులతో హోరెత్తించారు. మేరా భారత్ మహాన్ అంటూ నినాదాలు చేశారు.
ప్రస్తుతం నీరంజ్ చోప్రా విజయంతో దేశ వ్యాప్తంగా సంతోషం వ్యక్తం అవుతోంది. పలువురు జాతీయ పతాకాలను ఎగుర వేస్తున్నారు. ఇది తమ దేశానికి లభించిన గౌరవంగా వారంతా పేర్కొంటున్నారు.
యావత్ భారతావనికి ఇది పండుగ రోజు అంటున్నారు వారంతా. ఇదిలా ఉండగా నీరజ్ చోప్రా 88.14 మీటర్ల బెస్ట్ త్రో రెండో స్థానంలో నిలిచాడు. ఇక చోప్రా విజయం సాధించిన వెంటనే ఆయన నివాసంలో ఒక్కసారిగా ఆనందం వెల్లివిరిసింది.
లడ్డూలు పంపిణీ చేశారు. మహిళలు డ్యాన్సులతో హోరెత్తించారు. హర్యానా రాష్ట్రమంతా సంబురాలలో(Neeraj Chopra Celebration) మునిగి పోయింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు చోప్రాను. స్వర్ణం వస్తుందని అనుకున్నాం కానీ సిల్వర్ దక్కిందన్నారు.
Also Read : జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రాకు రజతం