Neha Narkhede : రిచ్ లిస్ట్ లో నేహా నార్ఖేడ్ రికార్డ్

పిన్న వ‌యస్కురాలిగా గుర్తింపు

Neha Narkhede : భార‌త దేశ ధ‌న‌వంతుల జాబితాలో అతి పిన్న వ‌యస్సు క‌లిగిన సెల్ఫ్ మేడ్ మ‌హిళా ధ‌న‌వంతురాలిగా నిలిచారు నేహా నార్ఖేడ్(Neha Narkhede). ఆమె మ‌హారాష్ట్ర‌లోని పూణేలో పెరిగారు.

కాన్ ఫ్లూయెంట్ తో పాటు ఓపెన్ సోర్స్ మెసేజింగ్ సిస్ట‌మ్ లో టాప్ గా ఉన్న అపాచీ కాఫ్కా కో ఫౌండ‌ర్ గా ఉన్నారు. ఇదిలా ఉండ‌గా ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ -2022 ఏడాదికి ప్ర‌క‌టించింది.

స్ట్రీమింగ్ డేటా టెక్నాల‌జీ కంపెనీ కాన్ ఫ్లూయెంట్ కంపెనీ స‌హ వ్య‌వ‌స్థాప‌కురాలిగా ఉన్నారు. 37 ఏళ్ల భార‌తీయ అమెరిక‌న్ సంప‌న్న వ్య‌క్తుల జాబితాలో అత్యంత పిన్న వ‌య‌స్సు క‌లిగిన మ‌హిళా పారిశ్రామిక‌వేత్త‌గా చోటు ద‌క్కించుకున్నారు.

పూణెలో పుట్టి పెరిగిన నార్ఖ‌డే(Neha Narkhede)  జార్ఝియా  ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీలో కంప్యూట‌ర సైన్స్ చ‌దివారు. కాన్ ఫ్లూయెంట్ తో పాటు ఓపెన్ సోర్స్ మెసేజింగ్ సిస్ట‌మ్ అపాచీ కాఫ్కా కు కూడా కీల‌కంగా ఉన్నారు.

బ‌హుళ టెక్నాల‌జీ కంపెనీల‌కు పెట్టుబ‌డిదారుగా , స‌ల‌హ‌దారుగా ప‌ని చేస్తున్నారు నేహా నార్ఖేడ్. హురున్ ఇండియా రిచ్ లిస్ట్ లో ఏకంగా ఆమె రూ. 4,700 కోట్ల సంప‌ద‌తో 336వ స్థానంలో నిలిచారు.

ఇదిలా ఉండ‌గా త‌న కంపెనీని ప్రారంభించే ముందు నార్ఖేడే లింక్డ్ ఇన్ , ఒరాకిల్ లో ప‌ని చేశారు. అక్క‌డ అపాచీ కాఫ్కా సాఫ్ట్ వేర్ ను అభివృద్ది చేసిన టీంలో భాగంగా ఉన్నారు.

అత్యున్న‌త సంస్థ‌ల‌లో ప‌ని చేసిన అనుభవం కొత్త కంపెనీల‌ను ఏర్పాటు చేసేందుకు దోహ‌ద ప‌డింది.

Also Read : గేట్స్ ఫౌండేష‌న్ భారీ విరాళం

Leave A Reply

Your Email Id will not be published!