Nehal Wadhera : చెన్నైకి షాకిచ్చిన నెహాల్ వధేరా
51 బంతులు 8 ఫర్లు 1 సిక్స్ 64 రన్స్
Nehal Wadhera : ఐపీఎల్ 16వ సీజన్ లో చెన్నై వేదికగా జరిగిన కీలకమైన లీగ్ మ్యాచ్ లో ధోనీ(MS Dhoni) సేన సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 139 పరుగులకే పరిమితమైంది.
అనంతరం బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ కేవలం 4 వికెట్లు కోల్పోయి 140 రన్స్ చేసి టార్గెట్ ను పూర్తి చేసింది. మహేంద్ర సింగ్ ధోనీ ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో క్రీజులోకి వచ్చిన ముంబై ఇండియన్స్ ఆదిలో ఆరంభం అదిరినా ఆ తర్వాత వెంట వెంటనే వికెట్లను కోల్పోయింది.
22 ఏళ్ల యంగ్ క్రికెటర్ నెహాల్ వధేరా(Nehal Wadhera) దుమ్ము రేపాడు. చెన్నైబౌలర్లకు చుక్కలు చూపించాడు. అత్యంత పరిణితి చెందిన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు ఈ కుర్రాడు. ఓ వైపు చెన్నై బౌలర్ల ధాటికి వికెట్లు రాలుతుంటే వధేరా మాత్రం ఎక్కడా చెక్కు చెదరలేదు. కళ్లు చెదిరే షాట్స్ తో దంచి కొట్టాడు. మొత్తం 51 బంతులు ఎదుర్కొన్న నెహాల్ వధేరా 64 రన్స్ చేశాడు.
ఇందులో 8 ఫోర్లు ఒక భారీ సిక్సర్ ఉంది. సూర్య కుమార్ యాదవ్ తో కలిసి భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. మొత్తంగా వధేరా గనుక ముందే ఔట్ అయి ఉంటే ముంబై ఇండియన్స్ 100 పరుగులు కూడా దాటి ఉండేది కాదు. ప్లే ఆఫ్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి ముంబైకి.
Also Read : 13 ఏళ్ల తర్వాత చెన్నై చమక్