David Warner Netflix : నెట్ ఫ్లిక్స్ సూచ‌న వార్న‌ర్ స్పంద‌న

రిటైర్ అయ్యాక న‌టిస్తే బెట‌ర్

David Warner Netflix : డేవిడ్ వార్న‌ర్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. మ‌నోడు ఆస్ట్రేలియ‌న్ అయిన‌ప్ప‌టికీ భార‌త్ తో ద‌గ్గ‌రి అనుబంధం ఉంది. అంత‌కంటే తెలుగు వారితో ఎన‌లేని క‌నెక్ట్ క‌లిగి ఉన్నాడు ఈ స్టార్ బ్యాట‌ర్. గ‌తంలో ఐపీఎల్ లో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌ర‌పున ఆడాడు. ఆపై కెప్టెన్ అయి ఏకంగా ఛాంపియ‌న్ గా నిల‌బెట్టాడు.

ఆ త‌ర్వాత అనుకోకుండా ఎస్ ఆర్ హెచ్ నుంచి వైదొలిగాడు. గ‌త ఐపీఎల్ వేలం పాటలో అతి త‌క్కువ ధ‌ర‌కు ఢిల్లీ క్యాపిట‌ల్స్ కు అమ్ముడు పోయాడు. ప్ర‌స్తుతం ఢిల్లీ క్యాపిట‌ల్స్ స్కిప్ప‌ర్ పంత్ తీవ్రంగా గాయ‌ప‌డ‌డంతో డేవిడ్ వార్న‌ర్ కు కెప్టెన్సీ ద‌క్కే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి.

ఇది ప‌క్క‌న పెడితే వార్న‌ర్ ఆట‌లో ఎంత పాపుల‌రో సోష‌ల్ మీడియాలో అంత వైర‌ల్ . క్ష‌ణాల్లో టాప్ సాంగ్స్ ను పేర‌డీ చేస్తూ పోస్టులు పెడుతుంటాడు. ఎప్ప‌టిక‌ప్పుడు యాక్టివ్ గా ఉంటూ స‌రదాగా తెలుగు పాపుల‌ర్ పాట‌ల‌కు డ్యాన్స్ ల‌తో హోరెత్తిస్తుంటాడు. అందుకే డేవిడ్ వార్న‌ర్(David Warner) కు విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

తెలుగు వారికి ఆత్మీయుడిగా మారి పోయాడు వార్న‌ర్. తాజాగా ప్రపంచ ఓటీటీ ఫ్లాట్ ఫార‌మ్ లో ఒక‌టిగా పేరొందిన నెట్ ఫ్లిక్స్ కీల‌క సూచ‌నలు చేసింది. అదేమిటంటే క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక తెలుగు సినిమాల‌లో న‌టించ‌మ‌ని పేర్కొంది ట్విట్ట‌ర్ వేదిక‌గా. దీనికి డేవిడ్ వార్న‌ర్ స్పందించాడు. న‌వ్వుతున్న ఎమోజీల‌ను షేర్ చేశాడు. ప్ర‌స్తుతం వార్న‌ర్ ట్వీట్ వైర‌ల్ గా మారింది.

Also Read : వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ట్టులో ఆ ఇద్ద‌రికి నో ఛాన్స్

Leave A Reply

Your Email Id will not be published!