Parliament Row Comment : వివాదాస్పదం ప్రారంభోత్సవం
అవును ఆమెకు అర్హత లేదా
Parliament Row Comment : కేంద్రంలో కొలువు తీరిన మోదీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదానికి దారి తీసింది. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన నూతన పార్లమెంట్(Parliament) భవన ప్రారంభోత్సవం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇది రాజకీయ వివాదానికి దారి తీసేలా చేసేందుకు ప్రధాన కారణం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తుండడం. ఇప్పటికే పార్లమెంట్(Parliament) నుంచి అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది. ఈనెల 28న నూతన భవనాన్ని ప్రారంభించనున్నారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి ప్రతిపక్షాలు. 20 పార్టీలు మండిపడ్డాయి. తాము హాజరు కాబోవడం లేదంటూ ప్రకటించాయి. అంతే కాకుండా ప్రముఖ న్యాయవాది జయా కిషన్ సుప్రీంకోర్టులో రాష్ట్రపతితో నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించేలా కేంద్ర సర్కార్ ను ఆదేశించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. విపక్షాలు ప్రధానిని టార్గెట్ చేశాయి.
ఇది పూర్తిగా అప్రజాస్వామికమని, రాజ్యాంగ విరుద్దమని మండిపడ్డాయి. ప్రధానంగా ఈ దేశానికి ప్రథమ పౌరురాలైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రారంభించకుండా చేయడం దారుణమని పేర్కొన్నాయి. దేశంలో రాచరిక పాలన సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశాయి. ఇది కావాలని చేయడం తప్ప మరోటి కాదని ఆరోపించాయి. అంతే కాదు మహాత్మా గాంధీని జీవితాంతం తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తి జయంతి రోజున కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాలన్న నిర్ణయించడం దారుణమని పేర్కొన్నాయి. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో కీలకమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతికి ఉన్న పవర్స్ ఏమిటో తెలియ చేశారు. ఇందుకు సంబంధించి రాజ్యాంగంలో 87వ ఆర్టికల్ స్పష్టంగా పేర్కొన్నారు. పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించాల్సి ఉంటుంది.
ఈ ఆర్టికల్ అత్యంత ప్రాముఖ్యమైనది. అన్ని కార్య నిర్వాహక అధికారాలు భారత రాష్ట్రపతికి ఉంటాయి. కౌన్సిల్ సలహా మేరకు నిర్ణయాలు తీసుకుంటారు రాష్ట్రపతి. కీలకమైన చట్టాలు ఆమోదం పొందాలంటే తప్పనిసరిగా ద్రౌపది ముర్ము అనుమతి కావాల్సిందే. సంతకం చేయాల్సిందే. ప్రభుత్వ పరంగా ప్రజా ధనంతో నిర్మించే ఏ భవనమైనా లేదా అధికారిక ఆఫీసు అయినా ప్రారంభించాల్సింది రాష్ట్రపతి. ఇవాళ మరోసారి ఆర్టికల్ 87 చర్చకు దారితీసేలా చేసింది. పీఎం వర్సెస్ రాష్ట్రపతికి సంబంధించి ఎవరు ప్రారంభించాలనే దానిపై దాఖలైన కేసుకు సంబంధించి భారత దేశ సర్వోన్నత న్యాయ స్థానం కీలకమైన తీర్పు వెలువరించనుంది. సీజేఐ ఎలాంటి తీర్పు వెలువరిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Also Read : CM KCR