ZeeJombi : జీ జాంబీ చిత్రం నుంచి మ‌రో పాట విడుద‌ల‌

Zee Jombi : జాంబీ వైరస్ మీద తొలిసారిగా మహిళా దర్శకురాలు దీపిక ఓ చిత్రం రూపొందిస్తున్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ, ఫిలిం మేకింగ్‌పై ఆస‌క్తితో దీపిక ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి జాంబీస్ వైరస్

Zee Jombi : జాంబీ వైరస్ మీద తొలిసారిగా మహిళా దర్శకురాలు దీపిక ఓ చిత్రం రూపొందిస్తున్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ, ఫిలిం మేకింగ్‌పై ఆస‌క్తితో దీపిక ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి జాంబీస్ వైరస్ మీద` ప‌క్కా స్క్రిప్ట్‌తో రూపొందించుకుని రంగంలోకి దిగి తీసిన జీ జాంబీ` చిత్ర షూటింగ్ పూర్తి కావ‌స్తోంది.

ఆర్యన్ గౌర, దివ్య పాండే హీరో హీరోయిన్లుగా న‌టించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ ను నిర్మాత రాజ్ కందుకూరి, ఫస్ట్ సాంగ్ `ది జాంబీ.. `ను సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడు త్రినాధ్ రావ్ నక్కిన విడుదల చేయ‌గా ఇండ‌స్ట్రీలో స్పంద‌న బాగా క‌నిపింది. తాజాగా ఈ మూవీ నుండి `అవును అని కాదు అని..` అంటూ సాగే మ‌రో లిరిక‌ల్ వీడియోసాంగ్‌ను విడుద‌ల చిత్ర యూనిట్ ఆదివారం విడుద‌ల చేసింది.

ఈ సందర్భంగా.. దర్శకురాలు దీపిక మాట్లాడుతూ – జీ జాంబీ మూవీ ఫ‌స్ట్‌లుక్‌కి, ఫ‌స్ట్ లిరిక‌ల్ వీడియోసాంగ్ రెస్పాన్స్ బాగుంద‌ని, ఈ క్ర‌మంలోనే మ‌రో లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను విడుద‌ల‌చేస్తుండ‌టం ఆనందంగా ఉంద‌న్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జ‌రుగుతున్నాయ‌ని, . త్వరలోనే ప్రేక్షకుల ముందుకు సినిమాని తీసుకు రాబోతున్నాం అన్నారు. ఆడియన్స్ అడుగ‌డుగునా థ్రిల్ అయ్యేలా చాలా హారర్ సన్నివేశాలు రూపొందించాన‌ని, ప్రతి ఆర్టిస్ట్, టెక్నీషియన్ పూర్తిగా స‌హ‌క‌రించార‌ని వారికి ధన్యవాదాలు చెప్పారామె. థియేటర్స్ లో నే ఈ సినిమా విడుదల చేస్తామ‌ని, మేము కష్టపడిన దానికి ప్రేక్షకులు మంచి ఫలితం ఇస్తారని భావిస్తున్నా అని ముగించారు.

హీరో ఆర్యన్ మాట్లాడుతూ– “`అవును అని కాదు అని..` సాగే ఈ లిరిక‌ల్ వీడియోసాంగ్ చాలా బాగా వ‌చ్చింది. . వినోద్ కుమార్ (విన్ను) సంగీతం పాటకు మరింత అందాన్నితీసుకువ‌స్తే, చిత్రీక‌ర‌ణ‌లో ద‌ర్శ‌కురాలి ప్ర‌తిభ అంద‌రికీ న‌చ్చుతుంద‌ని అన్నారు. త్వరలో ఈ సినిమా టీజర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం“, విడుద‌ల‌కు అన్ని స‌న్నాహాలు చేస్తున్నామ‌ని చెప్పారు. అన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!