New York Singapore : న్యూయార్క్..సింగపూర్ ఖరీదైన నగరాలు
డమాస్కస్ , ట్రిపోలీ అత్యంత చవక సిటీస్
New York Singapore : ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలుగా న్యూయార్క్ , సింగపూర్(New York Singapore) లు నిలిచాయి. ఈ ఏడాది (2022) ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైఇంది. ప్రపంచ వ్యాప్తంగా 172 నగరాల్లో 200కి పైగా ఉత్పత్తులు, సేవలలో 400 కంటే ఎక్కువ వ్యక్తిగత ధరలను పోల్చారు.
కాగా జీవన వ్యయం గత ఏడాదిలో సగటున 8.1 శాతం పెరిగింది. వరల్డ్ లో ఉమ్మడిగా నివసించేందుకు పై రెండు నగరాలు అత్యంత ఖరీదైనవిగా నిలిచాయి.
ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ కు సంబంధించిన వరల్డ్ వైడ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ కు సంబంధించి నివేదిక తయారు చేసింది. ఇందులో ఈ రెండు సీటీస్ టాప్ లో ఉన్నాయి.
ఉక్రెయిన్ లో యుద్దం ప్రభావం కూడా దీనిపై పడింది. గత ఏడాది ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో ఉ్న టెల్ అవీవ్ మూడో స్థానానికి ఎగబాకగా హాంకాంగ్ , లాస్ ఏంజెల్స్ మొదటి ఐదు ఖరీదైన స్థానాలలో ఉన్నాయి.
ఇక ప్రభుత్వ విధానాలు, కరెన్సీ కదలికలు కారణంగా వ్యక్తిగత పనితీరు మారుతూ ఉన్నప్పటికీ జీవన వ్యయంలో సగటు పెరుగుదల 4.5 శాతం కనిపించింది.
వడ్డీ రేటు తక్కువగా ఉండడంతో టోక్యో, ఒసాకా వరుసగా 24, 33 స్థానాలు పడి పోయాయి. ఇక సిరియా రాజధాని డమాస్కస్ , లిబియా లోని ట్రిపోలీ ప్రపంచంలోనే అత్యంత చౌకైన ప్రదేశాలుగా నిలిచాయి ఈ సర్వేలో.
ఇక సిడ్నీ టాప్ 10లో నిలిచింది. శాన్ ఫ్రాన్సిస్కో ఎనిమిదో స్థానానికి చేరుకుంది. షాంఘై టాప్ 20 లోకి చేరింది. ఆయా నగరాల పరంగా చూస్తే సింగపూర్, ,న్యూయార్క్ టాప్ లో ఉండగా ఇజ్రాయిల్ లోని టెల్ అవీవ్ మూడో స్థానంలో నిలిచింది.
చైనా లోని హాంకాంగ్ , అమెరికా లోని లాస్ ఏంజెల్స్ నాలుగు, ఐదు స్థానాల్లో ఉండగా స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ 6వ ప్లేస్ లో నిలిచింది. ఏడో స్థానంలో జెనీవా, 8వ ప్లేస్ లో శాన్ ఫ్రాన్సిస్కో, 9వ స్థానంలో పారిస్ , 10వ ప్లేస్ లో డెన్మార్క్ లోని కోపెన్ హాగన్ నిలిచింది. దీంతో పాటు సేమ్ ర్యాంకు సిడ్నీ కూడా చేరింది.
Also Read : దేశంలో విలువైన కంపెనీలు ఇవే