New York Times : ప్రపంచంలోనే టాప్ న్యూస్ లలో న్యూయార్క్ టైమ్స్ ఒకటి. ఇక యావత్ లోకాన్ని శాసిస్తోంది ఎక్కువగా ట్విట్టర్. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టు ఈ మైక్రో బ్లాగింగ్ సైట్ కు నిత్యం కోట్లాది మంది అడిక్ట్ అవుతూ వస్తున్నారు.
దీనికి పోటీగా ఇండియాలో కూ వచ్చినా లేదా ఇతర సంస్థలు ముందుకు తీసుకు వచ్చినా ఈరోజు వరకు ట్విట్టర్ ను కొట్టలేక పోతున్నారు. తాజాగా ట్విట్టర్ లో సిబ్బంది ఎక్కువగా గడుపుతున్నారంటూ సంచలన కామెంట్స్ చేసింది న్యూయార్క్ టైమ్స్(New York Times) .
దీని వల్ల ఇబ్బంది ఏర్పడుతోందని తక్కువగా వాడితే బెటర్ అని సూచిస్తోంది. ఈ మేరకు సదరు సంస్థ ట్విట్టర్ లో తక్కువ సమయం గడపాలని సిబ్బందిని కోరింది.
ఇందులో భాగంగా న్యూయార్క్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రిపోర్టర్ల ట్వీట్లను వారి ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తారని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ ఆదేశం కలకలం రేపుతోంది.
దీంతో ఎప్పుడు ఉపయోగించాలి, ఎలా వినియోగించాలనే దానిపై అప్ డేట్ ఇస్తోంది ఎన్ వై టీ(New York Times). ఆన్ లైన్ వేధింపుల నుంచి సిబ్బందిని రక్షించేందుకు సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ప్రధానమని కొత్త విధానం స్పష్టం చేస్తోంది.
ఈ విషయాన్ని న్యూయార్క్ పోస్ట్ ప్రకారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ డీన్ బాకెట్ పంపిన మెమోను ప్రసారం చేసింది. ఇది ఒక మార్పుకు సంబంధించిన అంశమని, నిషేధం మాత్రం కాదని తెలిపింది.
మీరు కొనసాగాలని ఎంచుకుంటే మీ జాబ్ లోని ఇతర భాగాలకు సంబంధించి మీరు ప్లాట్ ఫారమ్ లో ఎంత సమయం గడుపుతున్నారో అనేది చూడాల్సి ఉంటుందన్నాడు.
Also Read : భారత్ పై అమెరికా కామెంట్స్