ENG vs NZ 2nd Test : కీవీస్ ఇంగ్లాండ్ రెండో టెస్టుపై ఉత్కంఠ
224 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన కీవీస్
ENG vs NZ 2nd Test : ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్(ENG vs NZ 2nd Test) జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు రసవత్తరంగా మారింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 7 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసింది.
సాయంత్రం సెషన్ లో 110 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం మరో రెండు కీలక వికెట్లను చేజార్చుకుంది. ఇక లార్డ్స్
వేదికగా జరిగిన మొదటి టెస్టులో అద్భుత విజయాన్ని నమోదు చేసింది ఇంగ్లాండ్ జట్టు.
మాజీ కెప్టెన్ జో రూట్ , కెప్టెన్ బెన్ స్టోక్స్ , వికెట్ కీపర్ తో కలిసి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని
చేకూర్చి పెట్టారు. ఇందులో 115 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు జో రూట్.
ఇదే సమయంలో టెస్టు క్రికెట్ లో 10,000 పరుగులు పూర్తి చేసిన క్రికెటర్ గా ఘన వహించాడు. కాగా రెండో టెస్టులో సైతం దుమ్ము రేపాడు. అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు.
జట్టును ఒడ్డుకు చేర్చడంలో కీలక పాత్ర పోషించారు పోప్ , జో రూట్. ఇద్దరూ శతకాలతో చెలరేగారు. ఇక రెండో టెస్టు మ్యాచ్ విషయానికి వస్తే మంగళవారం ఆట కీలకం కానుంది.
త్వరగా 3 వికెట్లు పడగొడితే ఇంగ్లాండ్ ముందు టార్గెట్ ఉంటుంది. దానిని ఛేదిస్తే విజయం సాధ్యమవుతుంది. ఇక న్యూజిలాండ్(ENG vs NZ 2nd Test) రెండో ఇన్నింగ్స్ లో డారిల్ మిచెల్ 32 పరుగులతో ఉండగా మాట్ హెన్రీ 8 రన్స్ తో క్రీజులో ఉన్నాడు.
ఇదిలా ఉండగా ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ అరుదైన రికార్డు సృష్టించాడు. కీవీస్ ఓపెనర్ టామ్ లాథమ్ ను అవుట్ చేయడం
ద్వారా తన టెస్టు కెరీర్ లో 650 వికెట్లు పడగొట్టాడు.
దివంగత షేన్ వార్న్, శ్రీలంక స్టార్ స్పిన్నర్ మురళీధరన్ తర్వాత మైలు రాయిని అందుకున్న మూడో క్రికెటర్ అండర్సన్. అంతకు ముందు
ముందు ఇంగ్లండ్ 539 పరుగులకే ఆలౌటైంది. జో రూట్ 176 రన్స్ చేశాడు. బెన్ స్టోక్స్ 56 రన్స్ చేశాడు.
Also Read : శ్రీలంకతో వన్డే సీరీస్ కు ఆసిస్ జట్టు డిక్లేర్