Newzeland Test : ఇంగ్లండ్ లో పర్యటించే న్యూజిలాండ్ జట్టును ప్రకటించింది న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు(Newzeland Test ). ఇవాళ అధికారికంగా వెల్లడించింది. ఈ ఏడాది జూన్ లో ఇంగ్లండ్ లో పర్యటించనుంది.
టెస్టు జట్టుకు క్లాసికల్ ప్లేయర్ గా పేరొందిన కేన్ విలియమ్సన్ ను(Newzeland Test )మరోసారి కెప్టెన్ గా నియమించింది. చాలా కూల్ గా ఆడుకుంటూ వెళుతున్నాడు.
ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ ) 2022లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు స్కిప్పర్ గా ఉన్నాడు కేన్ మామ. ఇదిలా ఉండగా టెస్టు జట్టుకు సంబంధించి 20 మంది ఆటగాళ్లను డిక్లేర్ చేసింది.
గాయం కారణంగా కొంత కాలంగా దూరంగా ఉన్న విలియమ్సన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇంగ్లండ్ టూర్ లో న్యూజిలాండ్ మూడు టెస్టులు ఆడనుంది. దేశీవాళి ఆటల్లో దుమ్ము రేపుతున్న ప్లేయర్లకు కూడా అవకాశం ఇచ్చింది క్రికెట్ బోర్డు.
తొలి టెస్టును జూన్ 2న లార్డ్స్ క్రికెట్ మైదానంలో ఆడనుంది న్యూజిలాండ్ జట్టు. ఇదిలా ఉండగా జట్టు పరంగా చూస్తే ఇలా ఉంది. జట్టుకు నాయకుడిగా కేన్ విలియమ్సన్ ఉండగా టామ్ బ్లండెల్ వికెట్ కీపర్ గా ఆడనున్నాడు.
వీరితో పాటు మోస్ట్ పాపులర్ బౌలర్ ట్రెంట్ బౌల్డ్ , మైఖేల్ బ్రేస్ వెల్ , డేవాన్ కాన్వేను ఎంపిక చేసింది. వీరితో పాటు కోలిన్ డి గ్రాండ్ హోమ్ , జాకబ్ డఫీ, కామెరాన్ ఫ్లెచ్ ను తీసుకుంది.
మాట్ హెన్రీ, కైల్ జామీ సన్ , టామ్ లాథమ్ , డారిల్ మిచెల్ , హెన్రీ నికోల్స్ , అజాజ్ , రచిన్ రవీంద్ర, రూథర్ ఫోర్డ్ ,సౌథీ, టిక్నర్ , నీల్ వాగ్నర్ , విల్ యంగ్ ను ఎంపిక చేసింది.
Also Read : టీ20లో భారత్ టెస్టులో ఆసిస్ వన్డేలో కీవీస్