NewsClick Case : న్యూస్ క్లిక్ పై కేసు నమోదు
సంస్థ ఫౌండర్ ఇల్లు, ఆఫీసుల్లో సోదాలు
NewsClick Case : న్యూఢిల్లీ – చైనా నుంచి నిబంధనలకు విరుద్దంగా నిధులు పొందారంటూ దేశంలో పేరు పొందిన న్యూస్ పోర్టల్ న్యూస్ క్లిక్ పై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కేసు నమోదు చేసింది. సంస్థ ఫౌండర్ తో పాటు ఆయన ఇల్లు, ఆఫీసుల్లో సోదాలు చేపట్టింది. న్యూస్ క్లిక్ ను ఏర్పాటు చేసినప్పటి నుంచి నేటి దాకా చైనాను పొగుడుతూ ప్రత్యేక కథనాలు రాస్తూ వచ్చారని ఆరోపించింది.
NewsClick Case Viral
ఫౌండర్, ఎడిటర్ ప్రబీర్ పుర్కాయస్థ ఇల్లు, ఆఫీసులో సీబీఐ ఆధ్వర్యంలో సోదాలు చేపట్టారు మరోసారి. బుధవారం ఉదయమే బిగ్ షాక్ ఇచ్చారు. ప్రబీర్ ఇంటికి చేరుకున్నారు. అక్కడి నుండి ఆఫీసులో సైతం దాడులు చేపట్టారు. ఏక కాలంలో తనిఖీలు చేస్తున్నారు విస్తృతంగా.
కేంద్ర దర్యాప్తు సంస్థ సంచలన ఆరోపణలు చేసింది సదరు న్యూస్ పోర్టల్ పై. చైనా నుంచి నేరుగా నిధులు అందుతున్నాయని ప్రధాన ఆరోపణ. దీంతో ఢిల్లీ ఖాకీలు ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద కేసు నమోదు చేశారు.
న్యూస్ క్లిక్(NewsClick) ఫౌండర్ , ఎగ్జిక్యూటివ్ ఎడిటర్స్ , సీనియర్ జర్నలిస్టుల ఇళ్లలను జల్లెడ పట్టారు. సోదాలు చేస్తూనే ఉన్నారు. న్యూస్ క్లిక్ కు సంబంధించి ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్ తో పాటు మరికొన్ని చోట్ల తనిఖీలు చేపట్టారు. ఫోన్లు, ల్యాప్ టాప్ లు స్వాధీనం చేసుకున్నారు.
Also Read : Payyavula Keshav : బాబును చూస్తే జాలేస్తోంది