NZvsBAN 2nd Test : చెల‌రేగిన కీవీస్ త‌ల‌వంచిన బంగ్లా

ప్ర‌తీకారం తీర్చుకున్న న్యూజిలాండ్

NZ vs BAN 2nd Test : హ‌మ్మ‌య్య మ్యాచ్ అంటే ఇది. ప్రతీకారం ఇలాగే ఉండాలి. ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ గా ఉన్న న్యూజిలాండ్ ఎట్ట‌కేల‌కు బంగ్లాదేశ్ పై(NZ vs BAN 2nd Test) విజ‌యం సాధించింది. మొద‌టి టెస్టులో ప‌సికూన‌ల చేతుల్లో ఓడి పోయిన ఈ జ‌ట్టు తిరిగి త‌న స‌త్తా చాటింది.

కింగ‌స్టన్ వేదిక‌గా బంగ్లాదేశ్ తో జ‌రిగిన రెండో టెస్టులో ఇన్నింగ్స్ 117 ప‌రుగుల తేడాతో గ్రాండ్ విక్ట‌రీ సాధించింది. దీంతో రెండు టెస్టుల సీరీస్ ను స‌మం చేసింది కీవీస్. మ‌రో వైపు ఫాలో ఆన్ ఆడిన బంగ్లా కీవీస్ బౌల‌ర్ల ధాటికి చేతులెత్తేసింది.

278 ప‌రుగుల‌కే చాప చుట్టేసింది. ఫ‌స్ట్ టెస్టులో కీవీస్ ను దారుణంగా ఓడించింది బంగ్లాదేశ్. అయిన‌ప్ప‌టికీ బంగ్లాదేశ్ రెండో టెస్టులో గ‌ట్టి పోటీని ఇచ్చింది. ఆ దేశ జ‌ట్టులో బ్యాట‌ర్లు లిట‌న్ దాస్ అద్భుతంగా ఆడాడు.

ఏకంగా 102 ప‌రుగులు చేశాడు. మ‌రో ప్లేయ‌ర్ మోమినుల్ హ‌క్ 37 ప‌రుగులు చేసి టాప్ స్కోర‌ర్ గా నిలిచారు. ఇక న్యూజిలాండ్ బౌల‌ర్ల‌లో కైల్ జామీస‌న్ 4 వికెట్లు తీస్తే నీల్ వాగ‌న్న‌ర్ మూడు కీల‌క వికెట్లు ప‌డ‌గొట్టాడు.

అంత‌కు ముందు కీవీస్ మొద‌టి ఇన్నింగ్స్ లో భారీ ప‌రుగులు చేసింది. బంగ్లా బౌల‌ర్ల‌ను ఉతికి ఆరేసింది. 521 ప‌రుగులు చేసింది. ఆ జ‌ట్టు బ్యాట‌ర్ల‌లో స్కిప్ప‌ర్ టామ్ లాథ‌మ్ డ‌బుల్ సెంచ‌రీతో దుమ్ము రేపాడు.

అత‌డితో పాటు కాన్వే 109 ప‌రుగులు చేస్తే యంగ్ 54 ప‌రుగుల‌తో రాణించారు. మ‌రో వైపు బంగ్లా బౌల‌ర్లు స‌త్తా చాటారు. క‌ట్టుదిట్టంగా బంతులు వేయ‌డంతో బంగ్లాదేశ్ బ్యాట‌ర్లు(NZ vs BAN 2nd Test) ప‌రుగులు చేసేందుకు త‌డ‌బడ్డారు.

దీంతో బంగ్లా దేశ్ మొద‌టి ఇన్నింగ్స్ లో 126 ప‌రుగుల‌కే కుప్ప కూలింది.

Also Read : ఐపీఎల్ మెగా వేలంపై కీల‌క నిర్ణ‌యం

Leave A Reply

Your Email Id will not be published!