NZW vs PAKW : పాకిస్తాన్ ప‌రాజ‌యం ప‌రిస‌మాప్తం

వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీ నుంచి నిష్క్ర‌మ‌ణ

NZW vs PAKW  : ఊహించ‌ని రీతిలో పాకిస్తాన్ జ‌ట్టు ఐసీసీ మ‌హిళా వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి నిష్క్ర‌మించింది. ఇక దాయాది భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు దోబూచు లాడుతోంది సెమీస్ కోసం.

లీగ్ మ్యాచ్ లో భాగంగా న్యూజిలాండ్ లోని క్రైస్ట్ చ‌ర్చ్ వేదిక‌గా ఆతిథ్య జ‌ట్టు కీవీస్ తో జ‌రిగిన మ్యాచ్ లో పాకిస్తాన్(NZW vs PAKW )ఏకంగా 71 ర‌న్స్ తో ప‌రాజ‌యం మూట‌గ‌ట్టుకుంది. 266 ప‌రుగుల భారీ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన పాక్ ఏ కోశాన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేక పోయింది.

న్యూజిలాండ్ బౌల‌ర్ల ధాటికి పాక్ మ‌హిళా బ్యాట‌ర్లు ఆశించిన స్థాయిలో రాణించ‌లేక పోయారు. దీంతో 9 వికెట్లు కోల్పోయి 194 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మై పోయింది.

దీంతో ఓట‌మిని ఆహ్వానించింది. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే పాకిస్తాన్ బ్యాట‌ర్ల‌లో నిదా ధార్ హాఫ్ సెంచ‌రీ (50) తో మెరిసింది. మ‌రో బ్యాట‌ర్ బిస్మా మ‌రూఫ్ 38 ర‌న్స్ చేసి టాప్ స్కోర‌ర్లుగా (NZW vs PAKW )ఉన్నారు.

వీరిద్ద‌రూ గ‌నుక ఆడ‌క పోతే ఆ మాత్రం ప‌రుగు చేసి ఉండేది కాదు పాకిస్తాన్. ఇక కీవీస్ మ‌హిళా జ‌ట్టులో హ‌న్నా రోవ్ ఏకంగా అద్భుత‌మైన బౌలింగ్ తో 5 వికెట్లు తీసింది.

పాకిస్తాన్ ను కోలుకోలేని రీతిలో దెబ్బ కొట్టింది. హ‌న్నాతో పాటు ఫ్రాన్సిస్ మాకే రెండు వికెట్లు తీస్తే , మెయిర్ , కేర్ చెరో వికెట్ చొప్పున ప‌డ‌గొట్టారు. అంత‌కు ముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ లో బేట్స్ స‌త్తా చాటింది.

పాకిస్తాన్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించింది. 128 ప‌రుగులు కీల‌క పాత్ర పోషించింది. దీంతో కీవీస్ నిర్ణీత ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 265 ప‌రుగులు చేసింది. ఇక పాకిస్తాన్ బౌల‌ర్ల‌లో నిదా ధ‌ర్ 3, ఫాతిమా, అమీన్ చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.

Also Read : ఉమెన్ ఐపిఎల్‌కి సిద్ద‌మ‌వుతున్న బిసిసిఐ

Leave A Reply

Your Email Id will not be published!