Nirmala Sitharaman : బీజేపీ ఎంపీలకు బడ్జెట్ పై క్లారిటీ
ఇవ్వనున్న మంత్రి నిర్మలా సీతారామన్
Nirmala Sitharaman : కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భారతీయ జనతా పార్టీ ఎంపీలకు దానిపై అవగాహన కల్పించనున్నారు. దేశ రాజధాని లోని పార్లమెంట్ లైబ్రరీ భవనం లోని బాల యోగి ఆడిటోరియంలో ఉదయం 9 గంటలకు బ్రీఫింగ్ ఉంటుందని ఎంపీల అందరికీ సమాచారం అందింది. పూర్తిగా వివరించనున్నారు.
ఎంపీలు వేసే ప్రశ్నలకు కూల్ గా సమాధానం కూడా ఇవ్వనున్నారు. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు నరరేంద్ర మోదీ ప్రభుత్వం చివరి పూర్తి బడ్జెట్ ను సమర్పించారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి. ఫిబ్రవరి 3న లోక్ సభ , రాజ్య సభ రెండింటి లోనూ ఎంపీలకు అర్థం చేయించనున్నారు. ఈ సమావేశంలో ఎంపీలకు బడ్జెట్ గురించి వివరిస్తారు నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman).
సమాజంలోని ప్రతి వర్గ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ అంటే ఏమిటో , దానిని ఎలా బయటకు తీసుకు వచ్చారో సామాన్యులకు చెప్పాలని చెప్పనున్నారు. ఆయా నియోజకవర్గాలకు వెళ్లి ప్రజలకు చెప్పాలని ప్రధానంగా ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ కోరారు. ఇందుకు సంబంధించి ఎంపీలకు బడ్జెట్ గురించి తెలియ చేసే ప్రయత్నం చేస్తారు.
ఆదాయపు పన్ను రాయితీ పరిమితిని రూ. 7 లక్షలకు పెంచారు. కొత్త పన్ను విధానం తీసుకు వచ్చారు. పశు పోషణ, పాడి పరిశ్రమ, మత్స్య రంగాలపై దృష్టి సారించారు బడ్జెట్ లో. వ్యవసాయ రుణ లక్ష్యాన్ని రూ. 20 లక్షల కోట్లకు పెంచాలని చేసింది.ప్రతి ఒక్క ఎంపీ విధిగా హాజరు కావాలని పార్టీ కోరింది.
Also Read : బాల్య వివాహాలు చేస్తే అరెస్ట్ – సీఎం