Rajiv Kumar : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకు వచ్చిన నీతి ఆయోగ్ సంస్థ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ (Rajiv Kumar)గుడ్ బై చెప్పేశారు. తాను పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
దీంతో ఆయన స్థానంలో కొత్తగా కేంద్ర ప్రభుత్వం సుమన్ కే బెరీని నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. మే 1న నూతన వైస చైర్మన్ గా బాధ్యతలు చేపట్టనున్నారు.
అయితే విచిత్రం ఏమిటంటే ఈనెల 30 దాకా రాజీవ్ కుమార్ పదవీ కాలం ఉంది. తన టెన్యూర్ పూర్తి కాక ముందే రాజీవ్ కుమార్(Rajiv Kumar) తప్పు కోవడం చర్చనీయాంశంగా మారింది.
కొన్ని రోజుల ముందే రాజీనామా చేయడం వెనుక ఏమై ఉంటుందనే ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉండగా నీతి ఆయోగ్ లో పలు సంస్కరణలు తీసుకు వచ్చారు. పారదర్శకత ఉండేలా జాగ్రత్త పడ్డారు.
అపారమైన అనుభవం కలిగిన వ్యక్తిగా రాజీవ్ కుమార్ కు పేరుంది. నీతి ఆయోగ్ ద్వారానే దేశంలోని ఆయా రాష్ట్రాలకు గ్రేడింగ్ లు ఇస్తారు. వాటి పనితీరు ప్రామాణికంగానే నిధులు మంజూరు చేస్తారు.
మోదీ ప్రధానమంత్రిగా కొలువు తీరాక నీతి ఆయోగ్ కు ఎనలేని ప్రాధాన్యత పెరిగింది. ఇదిలా ఉండగా రాజీవ్ కుమార్ రాజీనామా చేశారని, ఆయన రిజైన్ ను ఆమోదిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
ఇక సుమన్ కె బేరి ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడిగా పని చేశారు. అంతకు ముందు అరవింద్ పనగరియా పని చేశారు.
Also Read : ట్రెజరీ కేసులో లాలూకు బెయిల్