Nitin Menon ICC : ఐసీసీ అంపైర్ల ప్యానల్ లో నితిన్ మీనన్
ఒకే ఒక్క భారతీయ అంపైర్ కు ఛాన్స్
Nitin Menon ICC : ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ 16 నుంచి ప్రారంభం కానుంది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 వరల్డ్ కప్. ఇందుకు సంబంధించి ఇవాళ ఐసీసీ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ఐసీసీ అంపైర్ ప్యానల్ ను ప్రకటించింది. ఇందులో భారత దేశం నుంచి ఒకే ఒక్క అంపైర్ ను ఎంపిక చేసింది.
వరల్డ్ వైడ్ గా మొత్తం 16 మంది అంపైర్లను నియమించింది. మొదటి రౌండ్ , సూపర్ 12 దశలలో మెగా టోర్నీ జరగనుంది. ప్రధానంగా 20 కీలక మ్యాచ్ లకు సంబంధించి అత్యంత అనుభవం కలిగిన అంపైర్లను నియమించింది. ఇండియా తరపున నితిన్ మీనన్ ను ఎంపిక చేసినట్లు తెలిపింది ఐసీసీ.
మొత్తంగా చూస్తే టోర్నమెంట్ లో రిచర్డ్ కెటిల్ బరో, నితిన్ మీనన్(Nitin Menon ICC), కుమార ధర్మసేన, మరైస్ ఎరాస్మస్ లు టోర్నమెంట్ లో
అధికారికంగా వ్యవహరిస్తారు. 2021 ఫైనల్ కు అంపైర్లుగా ఉన్నారు. ఈ ఏడాది ఆతిథ్య జట్టు తమ మొదటి ఐసీసీ పురుషుల టి20 ప్రపంచ కప్
టైటిల్ ను కైవసం చేసుకుంది.
ఇదిలా ఉండగా టోర్నీ సెమీ ఫైనల్స్ , ఫైనల్ కు అంపైర్లను నిర్ణీత సమయంలో ప్రకటిస్తామని ఐసీసీ స్పష్టం చేసింది. అనుభవం ప్రాతిపదికన 16 మందిని ఎంపిక చేసినట్లు పేర్కొంది. ఐసీసీ ఎలైట్ ప్యానల్ ఆఫ్ మ్యాచ్ రిఫరీల చీఫ్ రెఫరీ రంజన్ మదుగల్లె ఎనిమిదో ఎడిషన్ కు మ్యాచ్ రిఫరీలుగా ఉన్నారు.
జింబాబ్వేకు చెందిన ఆండ్రూ ఫైక్రాఫ్ట్, ఇంగ్లండ్ కు చెందిన క్రిస్టోఫర్ బ్రాడ్, ఆస్ట్రేలియాలకు చెందిన డేవిడ్ బూన్ లతో కలిసి శ్రీలంకకు చెందిన
మదుగెల్లెను చేర్చింది. పాల్ రీఫిల్ ఎరాస్మన్ తో కలిసి టివీ అంపైర్ గా వ్యవహరిస్తాడు. ఇక ఐసీసీ ఎంపిక చేసిన అంపైర్లు ఇలా ఉన్నారు.
అడ్రియన్ హోల్డ్ స్టాక్ , అలీమ్ దార్ , అహసన్ రజా, క్రిస్టోఫర్ బ్రౌన్ , క్రిస్టోఫర్ గగఫానీ, జోయల్ విల్సన్ , కుమార ధర్మసేన, లాంగ్టన్ రుసెరే, మరైస్
ఎరాస్మస్ , మైఖేల్ గోఫ్ , నితిన్ మీనన్ , పాల్ రీఫిల్ , పాల్ విల్సన్ , రిచర్డ్ ఇలింగ్ వర్త్ , రోచర్డ్ ఇల్లింగ్ వర్త్ ఉన్నారు.
Also Read : యూఏఈపై భారత్ విక్టరీ