Nitish Kumar : ఎంపీలున్నా పదవులు ఇవ్వలేదు – సీఎం
కేంద్ర సర్కార్ పై నితీశ్ కుమార్ ఫైర్
Nitish Kumar : బీహార్ సీఎం నితీశ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కేంద్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ సర్కార్ తమను పట్టించు కోలేదని ఆరోపించారు.
జేడీయూ పార్టీకి 16 మంది ఎంపీలు ప్రాతినిధ్యం ఉన్నాయని కానీ కేబినెట్ లో చోటు దక్కలేదన్నారు. తాను బీజేపీ హై కమాండ్ తో ఎంపీల సంఖ్యకు తగినట్లు నాలుగు కేంద్ర మంత్రి పదవులు ఇవ్వాలని కోరానని చెప్పారు.
శనివారం నితీశ్ కుమార్ మీడియా మాట్లాడారు. 2019లో కొలువు తీరిన కేంద్ర కేబినెట్ లో చోటు కల్పించేందుకు ప్రయారిటీ ఇవ్వలేదన్నారు.
అంతే కాదు తమ పార్టీని బలహీన పరిచేలా బీజేపీ ప్రయత్నం చేసిందని ఆరోపంచారు. ఆర్సీపీ సింగ్ ను తనపై ప్రయోగించాలని చూసిందన్నారు.
17 ఏళ్ల పాటు కొనసాగుతూ వచ్చిన బంధాన్ని తెంచు కోవాల్సి వచ్చిందని చెప్పారు నితీశ్ కుమార్(Nitish Kumar). తాము చేసిన డిమాండ్ ను బీజేపీ పట్టించుకోక పోవడం వల్లనే తాము కేబినెట్ లో చేరకూడదని నిర్ణయం తీసుకున్నామని అన్నారు సీఎం.
విచిత్రం ఏమిటంటే కేవలం బీజేపీకి చెందిన ఎంపీలు ఐదుగురు మాత్రమే ఉన్నారు బీహార్ రాష్ట్రం నుంచి. వారందరికీ కేబినెట్ లో చోటు కల్పించారని ఇది ఒక రకంగా తమను అవమానించడమేనని మండిపడ్డారు.
ఈ నిర్ణయం తమనే కాదు రాష్ట్ర ప్రజలను విస్తు పోయేలా చేసిందన్నారు. తప్పుడు సంకేతం వెళ్లేలా చేసిందన్నారు. బీజేపీ మరాఠా షిండే మోడల్ ను అమలు చేయాలని అనుకుందన్నారు.
కానీ తాను ముందే గుర్తించి కోలుకోలేని షాక్ ఇచ్చానని స్పష్టం చేశారు నితీశ్ కుమార్.
Also Read : శివసేన పార్టీ కోసం షిండే కొత్త భవనం