Nitish Rana Fined : నితీశ్ రాణాకు భారీ జ‌రిమానా

స్లో ఓవ‌ర్ రేట్ ..రూ. 24 ల‌క్ష‌లు ఫైన్

కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ కెప్టెన్ నితీశ్ రాణాకు కోలుకోలేని షాక్ త‌గిలింది. ఐపీఎల్ 16వ సీజ‌న్ లో భాగంగా చెన్నై లోని చెపాక్ స్టేడియంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ తో జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో కోల్ క‌తా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇదిలా ఉండ‌గా నిర్ణీత స‌మ‌యానికి బౌలింగ్ వేయ‌క పోవ‌డం, స్లో ఓవ‌ర్ రేట్ కార‌ణంగా ఐపీఎల్ నిర్వ‌హ‌ణ క‌మిటీ మండిప‌డింది.

ఈ మేర‌కు కోల్ క‌తా స్కిప్ప‌ర్ కు భారీ జ‌రిమానా విధిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. రెండోసారి శిక్ష ఖ‌రారు కావ‌డంతో ఏకంగా మ్యాచ్ ఫీజు నుంచి రూ. 24,00,000 ల‌క్ష‌లు ఫైన్ విధిస్తున్న‌ట్లు పేర్కొంది. ఈ మేర‌కు సోమ‌వారం బీసీసీఐ ఐపీఎల్ ప‌ర్య‌వేక్ష‌ణ క‌మిటీ వెల్ల‌డించింది.

మినిమం ఓవ‌ర్ రేట్ కు సంబంధించి ఐపీఎల్ ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి ప్ర‌కారం ఈ సీజ‌న్ లో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ కు ఇది రెండోసారి ఫైన్ వేయ‌డం జ‌రిగింద‌ని తెలిపింది. ఇందుకు గాను జ‌ట్టుకు నాయ‌క‌త్వం వ‌హిస్తున్న నితీశ్ రాణాకు రూ. 24 ల‌క్ష‌లు విధించిన‌ట్లు పేర్కొంది. ఇంపాక్ట్ స‌బ్ స్టిట్యూట్ తో స‌హా ప్లేయింగ్ ఎలెవ‌న్ లోని ప్ర‌తి స‌భ్యునికి కూడా ఫైన్ వేసిన‌ట్లు ఐపీఎల్ క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీ స్ప‌ష్టం చేసింది. రూ. 6 ల‌క్ష‌లు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతంగా ఉండ‌నుంద‌ని తెలిపింది.

Leave A Reply

Your Email Id will not be published!