Nithyananda Kailasa Comment : నిత్యానంద కైలాసా ఏమిటీ మాయ
తప్పించారా తప్పుకున్నాడా
Nithyananda Kailasa Comment : బాబాలు..స్వాములు..స్కాంలకు కొదవ లేదు ఈ దేశంలో. మతం, కులం అత్యధికంగా ప్రభావితం చూపుతుంది. ప్రజల బలహీనతలు ఆసరాగా చేసుకుని గురువులుగా చెలామణి అవుతున్న వారు లెక్కించ లేనంత మంది ఉన్నారు.
మరోసారి నిత్యానంద హాట్ టాపిక్ గా మారారు. ఏకంగా జెనీవాలో జరిగిన యుఎన్ సమావేశంలో తాను స్థాపించిన దేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసా (యుఎస్కే) నుంచి శాశ్వత ప్రతినిధి అంటూ విజయ ప్రియ నిత్యానంద కైలాసా హాజరయ్యారు.
ఆపై భారత దేశంపై అవాకులు చెవాకులు పేలింది. ఇది పక్కన పెడితే ఇంతకూ నిత్యానంద దేశం దాటి ఎలా వెళ్లగలిగాడు. దీని వెనుక ఎవరు ఉన్నారనేది అంతు చిక్కని ప్రశ్నలు ఎన్నో.
ఇదంతా పక్కన పెడితే కైలాసా అనేది ఎక్కడ ఉంది. ఇది గుర్తింపు పొందిన దేశమా. మరి ఎందుకు ఇది చర్చలోకి వచ్చిందో చూస్తే విస్తుపోక తప్పదు.
నిత్యానంద తనంతకు తానుగా దేవుడినంటూ (Nithyananda Kailasa Comment) ప్రకటించాడు. ఆపై అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొన్నాడు. కేసులు నమోదయ్యాయి. అరెస్ట్ అయ్యాడు. ఒకానొక రాత్రి చెప్పా పెట్టకుండా దేశం దాటి పోయాడు.
దేశాన్ని కొల్లగొట్టిన వాళ్లు, బడా వ్యాపారవేత్తలు, ఆర్థిక నేరగాళ్లకు ఇది ఒక సాకుగా మారింది దేశం దాటి వెళ్లి పోవడం. ఇలా చెక్కేస్తే ఇక వారిని పట్టుకోవడం చాలా కష్టం. ఇక నిత్యానంద రేప్ , కిడ్నాప్ కు పాల్పడినట్లు రూఢీ అయ్యింది.
2019లో భారత దేశం నుంచి పారి పోయాడు. ఒక ఏడాది వరకు ఎక్కడా కనిపించ లేదు. ఆ తర్వాత ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు.
తాను కొత్త దేశాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించాడు నిత్యానంద. ఈ కల్పిత దేశం పేరు కైలాసా. సోషల్ మీడియాలో నిత్యం ఫోటోలు, పూజలు, ప్రసంగాలు, వీడియాలు దర్శనం ఇస్తున్నాయి.
ఇక ఈ వివాదాస్పద దేవుడికి భారీ ఎత్తున అభిమానులు, శిష్యురాళ్లు, భక్తులు కూడా ఉండడం విశేషం. తమ దేశంలో జరుగుతున్న పరిణామాలపై పోస్టులు షేర్ చేస్తూ ఉంటారు.
అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ ప్రకారం నిత్యానంద ఈక్వెడార్ తీరంలో ఒక ద్వీపాన్ని కొనుగోలు చేశాడు. అక్కడే అతడు కైలాసని స్థాపించినట్లుపేర్కొన్నాడు. దానికి సంబంధించినంత వరకు ఇంకా క్లారిటీ రాలేదు ఇప్పటి దాకా. విచిత్రం ఏమిటంటే రిపబ్లిక్ ఆఫ్ కైలాసాకు సంబంధించిన ప్రతినిధులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దౌత్యవేత్తలతో సంభాషించడం, ఫోటోలు షేర్ చేస్తూ వస్తున్నారు.
అంతే కాదు యుఎస్కే కు సంబంధించి స్వంతంగా కరెన్సీని కూడా డిక్లేర్ చేశాడు నిత్యానంద. ఇందుకు సంబంధించిన వెబ్ సైట్ ప్రకారం కైలాస అనేది కెనడా, యుస్ఏ , ఇతర దేశాల నుండి మైనార్టీ కమ్యూనిటీ సభ్యులతో స్తాపించ బడింది. ఇ వీసా కోసం దరఖాస్తులను కూడా కైలాస(Nithyananda Kailasa) ఆహ్వానించింది ట్విట్టర్ వేదికగా.
యుఎస్కే జెండా, రాజ్యాంగం, ఆర్థిక వ్యవస్థ, పాస్ పార్ట్ , చిహ్నం కూడా కలిగి ఉందని ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చంటూ తెలిపింది.
అంతే కాదు కైలాస దేశం ట్రెజరీ, వాణిజ్యం, సార్వభౌమాధికారం, హౌసింగ్ , మానవ వనరుల సేవలు, తదితర విభాగాలు కూడా కలిగి ఉంది.
కైలాసా తనను తాను అంతర్జాతీయ హిందూ సమాజానికి కేరాఫ్ అని పేర్కొనడం విస్మయం కలిగిస్తోంది. ఇప్పటి వరకు ఐక్య రాజ్య సమితి కైలాసను ఒక దేశంగా గుర్తించ లేదు. ఒక దేశంగా గుర్తించాలంటే నానా తంటాలు పడాల్సి ఉంటుంది. అంతర్జాతీయ ఫోరమ్ లో తమ దేశం తరపున విజయప్రియను పంపాడు నిత్యానంద. కానీ యుఎన్ ఒప్పుకోలేదు.
ఏది ఏమైనా ఈ నిత్యానంద వెనుక ఎవరు ఉన్నారనేది ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్న. మోదీ సర్కార్ ఇప్పటికైనా మేలుకుంటుందా అతడిని పట్టుకుంటుందా లేదా వేచి చూడాలి.
Also Read : ఎవరీ విజయప్రియ ఏమిటా కథ