Nirmala Sitharaman : ఆదాయానికి కొత్త పన్నులు లేవు – నిర్మలా
మధ్యతరగతి సమస్యలపై కేంద్ర మంత్రి
Nirmala Sitharaman : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదాయానికి కొత్త పన్నులు ఏవీ లేవని స్పష్టం చేశారు. తాను కూడా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చానని చెప్పారు. దైనందిన జీవితంలో సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తనకు అవగాహన ఉందన్నారు నిర్మలా సీతారామన్.
ఈ విభాగం ఎదుర్కొంటున్న ఇబ్బందులను అర్థం చేసుకున్నానని అందుకే ప్రస్తుతం ప్రవేశ పెట్టే బడ్జెట్ లో ఎలాంటి భారం మోప కూడదని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి(Nirmala Sitharaman). పార్లమెంట్ లో బడ్జెట్ సమావేశానికి ముందు కీలక వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఆధ్వర్యంలో నిర్వహించే పత్రిక పాంచజన్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ హాజరై ప్రసంగించారు. తాను కూడా మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తినని, మధ్య తరగతి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏమిటో అనుభవ పూర్వకంగా తెలుసని చెప్పారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి.
ప్రస్తుత ప్రభుత్వం ఏటా రూ. 5 లక్షల లోపు సంపాదిస్తున్న వారిపై ఎలాంటి కొత్త పన్నులు విధించ లేదని ప్రకటించారు. స్మార్ట్ సిటీల నిర్మాణం, ఈజ్ ఆఫ్ లివింగ్ ను ప్రోత్సహించడం, మధ్య తరగతి సమస్యను పరిష్కరించేందుకు మెట్రో రైలు నెట్ వర్క్ ను అభివృద్ది చేయడం వంటి అనేక చర్యలను కేంద్రం తీసుకుందన్నారు.
ప్రభుత్వం మూల ధన వ్యయంపై ఖర్చులను పెంచుతోందని , ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 35 శాతం పెరిగి రూ. 7.5 లక్షల కోట్లకు చేరుకుందన్నారు.
Also Read : టాటా చైర్మన్ తో కేటీఆర్ భేటీ