Mohammad Hafeez : పాకిస్తాన్‌ లో పెట్రోల్..డ‌బ్బులకు క‌ట‌క‌ట‌

మాజీ క్రికెట‌ర్ మ‌హ్మ‌ద్ హ‌ఫీజ్ ట్వీట్ 

Mohammad Hafeez : దాయాది దేశం పాకిస్తాన్ మ‌రో శ్రీ‌లంక కానుందా. ఈ విష‌యాన్ని అవున‌నే అంటున్నారు పాకిస్తాన్ కు చెందిన మాజీ క్రికెట‌ర్ మ‌హ్మ‌ద్ హ‌ఫీజ్. బుధ‌వారం ఆయ‌న చేసిన ట్వీట్ క‌ల‌క‌లం రేపింది.

ఆ దేశాన్నే కాదు ప్ర‌పంచాన్ని విస్తు పోయేలా చేసింది. పాకిస్తాన్ లో ఏం జ‌రుగుతుంద‌నే వాస్త‌వం బోధ ప‌డేలా చేశారు ఈ మాజీ క్రికెట‌ర్. లాహోర్ లోని స్టేష‌న్ లో వాహ‌నానికి పెట్రోల్ పోయించు కుందామ‌ని వెళితే అక్క‌డా దొర‌క‌డం లేదు.

నో స్టాక్ అన్న బోర్డు క‌నిపించింది. ఇక డ‌బ్బులు తీసుకుందామ‌ని ఏటీఎం (ఎనీ టైం మెషీన్ ) ద‌గ్గ‌ర‌కు వెళ్లా. అక్క‌డ కూడా నో

మ‌నీ అని వ‌స్తోంది. దేశం త‌రపున క్రికెట్ ఆడిన నాకే ఈ ప‌రిస్థితి ఇలా ఉంటే ఇక సామాన్య ప్ర‌జ‌ల ప‌రిస్థితి ఏంటి అంటూ నిల‌దీశాడు మ‌హ్మ‌ద్ హ‌ఫీజ్(Mohammad Hafeez).

పాకిస్తాన్ మాజీ క్రికెట్ కెప్టెన్ గా చ‌రిత్ర సృష్టించిన ఇమ్రాన్ ఖాన్ ఆట‌కు గుడ్ బై చెప్పి రాజ‌కీయాల్లోకి వ‌చ్చాడు. దేశాన్ని మారుస్తాన‌ని ప్ర‌గ‌ల్భాలు ప‌లికాడు. కానీ 4 ఏళ్ల‌కే ప‌ద‌వీచ్యుతుడై ప్ర‌ధాని ప‌ద‌విని కోల్పోయాడు.

ఆయ‌న‌ను దించేసిన ప్ర‌తిప‌క్షాలు ప్ర‌స్తుతం కొలువు తీరాయి. తాజా ప్ర‌భుత్వాన్ని నిల‌దీశాడు, క‌డిగి పారేశాడు మ‌హ్మ‌ద్ హ‌ఫీజ్. బాధ్య‌త క‌లిగిన

ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు , దేశానికి జ‌వాబుదారీగా ఉండాల‌ని సూచించాడు.

ఇదిలా ఉండ‌గా హ‌ఫీజ్(Mohammad Hafeez)  లేవనెత్తిన ప్ర‌శ్న‌లు తీవ్ర చ‌ర్చ‌కు దారి తీశాయి. ఇది దేశంలో కొన‌సాగుతున్న అనిశ్చిత

ప‌రిస్థితిని తెలియ చేస్తోంది. ఇదిలా ఉండ‌గా హ‌ఫీజ్ పాకిస్తాన్ త‌ర‌పున మూడు ఫార్మాట్ ల‌లో ప్రాతినిధ్యం వ‌హించాడు.

2017 చాంపియ‌న్స్ ట్రోఫీని గెలుచుకున్న జ‌ట్టులో స‌భ్యుడు కూడా. కేవలం పాల‌కులు లేదా రాజ‌కీయ నాయ‌కుల వ‌ల్ల దేశ ప్ర‌జ‌లు, సామాన్యులు ఎందుకు బాధ ప‌డాలి అని హ‌ఫీజ్ ప్ర‌శ్నించాడు.

హ‌ఫీజ్ త‌న ప్ర‌శ్న‌ల‌ను మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ కు, ప్ర‌స్తుత ప్ర‌ధాని షెహ‌బాజ్ ష‌రీఫ్ కు ట్యాగ్ చేశాడు.

Also Read : ఉత్కంఠ పోరులో ఎలిమినేట‌ర్ ఎవ‌రో

Leave A Reply

Your Email Id will not be published!