Prashant Kishor : ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన ఇవాళ అక్టోబర్ 2 నుంచి మహాత్మా గాంధీ జయంతి రోజున తాను 3,000 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టున్నట్లు ప్రకటించారు.
ఆయన చేసిన ప్రకటన రాజకీయ వర్గాలలో కలకలం రేపింది. బీహార్ రాజకీయాలలో పెను ప్రకంపనలు సృష్టించింది. కాగా తాను కొత్తగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేయ బోవడం లేదంటూ ప్రకటించారు.
ఈ తరుణంలో ఓ జాతీయ ఛానల్ తో ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) మాట్లాడారు. ఆయన ఇటీవల నాలుగు సార్లు గాంధీ ఫ్యామిలీతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీకి రూట్ మ్యాప్ తయారు చేశారు.
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ తరుణంలో ఆయనకు ఆ పార్టీ హై కమాండ్ తమ పార్టీలో చేరమంటూ ఆఫర్ ఇచ్చింది. కానీ ఆయన దానిని తిరస్కరించారు.
ఇదే సమయంలో కొత్తగా పార్టీ పెట్టనున్నట్లు ప్రచారం జరిగింది. ఈ సమయంలో తాను పార్టీ పెట్టడం లేదని పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించారు ప్రశాంత్ కిషోర్.
ఈ సందర్భంగా పీకే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీతో తాను నిరాశకు గురి కాలేదన్నారు.
ఇదే సమయంలో అతడితో సమానం కాదని స్పష్టం చేశారు ప్రశాంత్ కిషోర్(Prashant Kishor). రాహుల్ గాంధీ పట్ల ఎలాంటి విసుగు లేదు. నేను సాధారణ కుటుంబానికి చెందిన వ్యక్తిని.
ఆయన నన్ను పిలిచారు. ఫోన్ చేసి మాట్లాడారు. విశ్వాసం ఉంది కనుకే స్నేహం కంటిన్యూ నడిచిందన్నారు.