National Comment : ప్రశ్నిస్తేనే ప్రజాస్వామం లేదంటే శూన్యం
ఎంపీలే వేటు ఎంత వరకు సబబు
National Comment : ప్రజల చేత ప్రజల కోసం ప్రజల కొరకు ఎన్నుకునేదే ప్రజాస్వామ్యం. మెజారిటీ ఉన్నంత మాత్రాన తాము చెప్పిందే చట్టం, అదే శాసనం అనుకుంటే పొరపాటు పడినట్లే. ప్రశ్నిస్తేనే ప్రజాస్వామ్యానికి మనుగడ లేక పోతే అది శూన్యమే అవుతుంది.
జీఎస్టీ పేరుతో అడ్డగోలుగా కోట్లాది ప్రజలు నిత్యం వాడే నిత్యావసర వస్తువులపై పన్ను విధించడం ఎంత వరకు సబబో కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి.
ఇదే విషయాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. పార్లమెంట్ అంటేనే ప్రజాస్వామ్య దేవాలయం. మరి ప్రతిపక్షాల నోరు నొక్కేస్తే ఇక లోక్ సభ, రాజ్యసభలు ఎందుకు ఉన్నట్లో ఆలోచించాలి.
ఈ దేశంలో ఖర్చు చేసే ప్రతి పైసా ప్రజలకు చెందినది అని గుర్తుంచు కోవాలి. వారి కష్టార్జితం రూపేణా చెల్లించిన పన్నులే ఇవాళ ప్రజా ప్రతినిధులకు వేతనాలు, సౌకర్యాలు అందుతున్నాయి.
ఈ తరుణంలో లోక్ సభ లో జీఎస్టీ విధించడాన్ని ప్రశ్నించిన పాపానికి నలుగురు కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేస్తూ స్పీకర్ ఓం బిర్లా నిర్ణయం తీసుకున్నారు.
ప్ల కార్డులు ప్రదర్శించ వద్దంటూ కూడా ఇటీవలే రూల్స్ పాస్ చేసింది. ప్రజా స్వామ్యంలో నిరసన, ఆందోళన ప్రాథమిక హక్కు. ఆ హక్కును కూడా లేకుండా చేస్తే అది డెమోక్రసీ(National Comment) అనిపించుకోదు.
కేవలం రాచరిక పాలనను గుర్తుకు తెస్తుంది. ఓ వైపు ద్రవ్యోల్బణం ఇంకో వైపు నిరుద్యోగం పెరుగుతూ పోతే ద్వీప దేశం శ్రీలంక గా మారే ప్రమాదం ఉంది. తస్మాత్ జాగ్రత్త.
Also Read : తప్పు చేయను చేస్తే సహించను – దీదీ