Elon Musk : యుద్దం వద్దే వద్దు శాంతి ముద్దు – మస్క్
ఉక్రెయిన్ పై రష్యా యుద్దాన్ని విరమించాలి
Elon Musk : రష్యా ఉక్రెయిన్ పై కొనసాగిస్తున్న యుద్దం ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా యుద్దం వద్దంటూ కోరుతోంది. ఇప్పటికే ఐక్యరాజ్య సమితి తీర్మానం కూడా చేసింది. పలు దేశాలు యుద్దాన్ని నిరసించాయి.
ఈ మేరకు టెస్లా సిఇఓ, చైర్మన్ ఎలోన్ మస్క్(Elon Musk) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్, రష్యా అధ్యక్షులు జెలెన్ స్కీ, వ్లాదిమిర్ పుతిన్ లు సంయమనం పాటించాలని కోరారు. ఇరువురికీ యుద్దం ఎంత మాత్రం మంచిది కాదని పేర్కొన్నారు. శాంతితోనే ప్రపంచం మనుగడ సాధిస్తుందన్నారు. ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
2014లో మాస్కో స్వాధీనం చేసుకున్న క్రిమియాను రష్యాగా అధికారికంగా గుర్తించాలని, క్రిమియాకు నీటి సరఫరాకు హామీ ఇవ్వాలని , ఉక్రెయిన్ తటస్థంగా ఉండాలని ఎలోన్ మస్క్ సూచించారు. ఇందుకు సంబంధించి అవును లేదా నో అని ఓటు వేయాలని ట్విట్టర్ వేదికగా నెటిజన్లను కోరారు.
ప్రజలకు ఇష్టమైతే రష్యా వెళ్లి పోవాలని పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా ఎలోన్ మస్క్(Elon Musk) చేసిన సూచనను తీవ్రంగా ఖండించారు ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ. మస్క్ కు అంత సీన్ లేదన్నారు. ఎలోన్ మస్క్ రెండు నాల్కల ధోరణిని అనుసరిస్తున్నాడంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక రకంగా చూస్తే టెస్లా సిఇఓ తన వ్యాపార ధోరణిని ఇలా చాటు కున్నాడంటూ మండిపడ్డారు. ఎంత మాత్రం తాము ఎలోన్ మస్క్ ప్రతిపాదనను ఒప్పుకునే ప్రసక్తి లేదన్నారు. ఓ వైపు ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండానే యుద్దానికి దిగిన పుతిన్ ముమ్మాటికీ యుద్ద నేరస్తుడేనని ఆరోపించారు.
Also Read : 5 నుంచి జై శంకర్ విదేశీ పర్యటన