Airtel Chairman : ఎవ‌రొచ్చినా మాకు పోటీ కారు – మిట్ట‌ల్

ఎయిర్ టెల్ చైర్మ‌న్ కామెంట్స్

Airtel Chairman : దేశ వ్యాప్తంగా 5జీ స‌ర్వీసుల పైనే ఎక్కువ‌గా చ‌ర్చ జ‌రుగుతోంది. ఇప్ప‌టికే స్పెక్ట్ర‌మ్ వేలం పూర్త‌యింది. భారీ ఎత్తున మోదీ ప్ర‌భుత్వానికి ఆదాయం స‌మ‌కూరింది.

బిడ్ లో ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిల‌య‌న్స్ జియో, అదానీ గ్రూప్ సంస్థ‌ల చైర్మ‌న్ గౌతం అదానీ, వొడా ఫోన్ ఐడియాతో పాటు భార‌తీ మిట్ట‌ల్ సార‌థ్యంలో ఎయిర్ టెల్ చేజిక్కించుకున్నాయి.

ఇప్ప‌టికే రిల‌య‌న్స్ జియో, ఎయిర్ టెల్ పోటా పోటీగా టెస్టింగ్ లు కూడా ప్రారంభించాయి. ప్ర‌స్తుత టెలికాం మార్కెట్ లో ఇరు కంపెనీలు నువ్వా నేనా అన్న రీతిలో పోటీ ప‌డుతున్నాయి.

మొద‌ట‌గా 13 న‌గ‌రాల‌లో, ప‌ట్ట‌ణాలు, జిల్లాలు, గ్రామీణ ప్రాంతాల‌కు 5జీ స‌ర్వీసు సేవ‌లు విస్త‌రించే ప‌నిలో ప‌డ్డాయి టెలికాం కంపెనీలు. ఇదిలా ఉండ‌గా 5జీ స్పెక్ట్ర‌మ్ వేలంలో అదానీ గ్రూప్ కూడా తోడ‌వ‌డంతో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు ఎయిర్ టెల్ చైర్మ‌న్ భార‌తీ మిట్ట‌ల్(Airtel Chairman).

ఎవ‌రి స‌త్తా ఏమిటో ఇప్ప‌టికే వినియోగదారుల‌కు తెలుస‌న్నారు. శ‌నివారం ఆయ‌న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. త‌మ‌కు ద‌మ్ముంద‌ని ఎవ‌రు రంగంలోకి దిగినా లేదా వ‌చ్చినా త‌మ‌కు అభ్యంత‌రం లేద‌న్నారు.

జియోను త‌ట్టుకుని నిల‌బ‌డ్డాం. మేం జ‌నాక‌ర్ష‌క ప్యాకేజీలు ప్ర‌కటించం. మా స్ట్రాట‌జీ అంతా ఒక్క‌టే. మెరుగైన సేవ‌లు అందించ‌డం.

ఎలాంటి స‌మ‌స్య‌లు లేకుండా చూడ‌డం. న‌మ్మ‌కం, నాణ్య‌వంతమైన టెలికాం సంస్థ‌గా ఇప్ప‌టికే తాము పేరు తెచ్చుకున్నామ‌ని స్ప‌ష్టం చేశారు భారతీ మిట్ట‌ల్. ఇందులో ఎలాంటి అనుమానం లేద‌న్నారు. ఇంకొక‌రు వ‌స్తార‌ని తాము భ‌య‌ప‌డ బోమ‌న్నారు.

Also Read : డిజిట‌ల్ చెల్లింపుల ఛార్జీల‌పై కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!