ICC Nominees : ప్లేయర్ ఆఫ్ ది మంత్ నామినీస్ వీళ్లే
ప్రకటించిన ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్
ICC Nominees : ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)(ICC Nominees) కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ప్రతి నెలా ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను పురుషుల, మహిళలకు అందజేస్తుంది. ప్రతి కేటగిరీలో ముగ్గురిని పరిగణలోకి తీసుకుంటుంది.
ఇందులో టాప్ లో నిలిచిన వారిని ఆ నెలకు అత్యుత్తమ ప్లేయర్ అవార్డును బహూకరిస్తుంది. తాజాగా మరోసారి అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకుంటూ వస్తున్నాడు ఇంగ్లండ్ ప్లేయర్ జానీ బెయిర్ స్టో.
అతడితో పాటు శ్రీలంక స్టార్ స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య, ప్రాన్స్ యువ ఆటగాడు గుస్తావ్ మెక్ కియోన్ చోటు దక్కించుకున్నారు. ఈ నామినీస్ లిస్టులో ఒక్క భారతీయ క్రికెటర్ లేక పోవడం గమనార్హం.
ఇక ఉత్తమ మహిళా క్రికెటర్ విషయానికి వస్తే భారత జట్టుకు చెందిన యువ బౌలర్ రేణుకా సింగ్ , ఇంగ్లండ్ క్రికెటర్ ఎమ్మా లాంబ్ , సీవర్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేసులో నిలిచారు.
విచిత్రం ఏమిటంటే పురుషుల కంటే మహిళలే సత్తా చాటుతున్నారు. బ్రిటన్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022 లో మొదటిసారిగా ప్రవేశ పెట్టిన క్రికెట్ ఈవెంట్ లో భారత మహిళా జట్టు సెమీ ఫైనల్ కు చేరుకుంది.
జూన్ మంత్ లో బెయిర్ స్టో ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా నిలిచాడు. తన పర్ ఫార్మెన్స్ ను కంటిన్యూ చేస్తున్నాడు. స్వదేశంలో జరిగిన టెస్టుల్లో మనోడు దుమ్ము రేపాడు.
భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆపై రెండు సెంచరీలు సాధించాడు. ఆపై వన్డే, టి20 మ్యాచ్ ల్లోనూ సత్తా చాటాడు. ఇక ప్రభాత్ జయసూర్య అద్భుతమైన బౌలింగ్ తో పాకిస్తాన్ కు ముచ్చెమటలు పట్టించాడు.
Also Read : హార్దిక్ పాండ్యాకు ప్రమోషన్ దక్కనుందా