ఇండియన్ ప్రిమీయర్ లీగ్ 16వ సీజన్ లో ఆఫ్గనిస్తాన్ బౌలర్లు దుమ్ము రేపుతున్నారు. ఆ ఇద్దరూ ఎవరో కాదు ఒకరు నూర్ అహ్మద్ మరొకరు ఇప్పటికే అద్భుతమైన బౌలర్ గా పేరు పొందిన ఆల్ రౌండర్ రషీద్ ఖాన్. 2022లో జరిగిన ఐపీఎల్ 15వ సీజన్ లో ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ ఊహించని రీతిలో ఐపీఎల్ టైటిల్ ను కైవసం చేసుకుని మిగతా జట్లను విస్తు పోయేలా చేసింది.
జట్టుకు దూరమై తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న హార్దిక్ పాండ్యాకు అనూహ్యంగా కెప్టెన్సీ వరించింది. ప్రధానంగా గుజరాత్ టైటాన్స్ జట్టుకు హెడ్ కోచ్ ఒకప్పటి భారత స్టార్ బౌలర్ ఆశిష్ నెహ్రా బలంగా మారాడు. నిత్యం జట్టును ఉత్సాహ పర్చడంలో, వ్యూహాలు అమలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చాడు.
ఇక నెహ్రా ఏరికోరి ఎంచుకున్నాడు ఆఫ్గనిస్తాన్ బౌలర్లను. ఐపీఎల్ వేలం పాటలో భారీ ధరకు కొనుగోలు చేసింది ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ ను. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయలేదు. ప్రధానంగా పవర్ ప్లే లోనే సత్తా చాటుడున్నాడు. తన అద్భుతమైన బౌలింగ్ తో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు.
ఈసారి ఐపీఎల్ సీజన్ లో ఒక్క సంజూ శాంసన్ తో తప్ప మిగతా బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. మరో ఆఫ్గనిస్తాన్ బౌలర్ నూర్ అహ్మద్ వచ్చీ రావడంతోనే ఐపీఎల్ లో తనదైన ముద్ర కనబర్చాడు.
రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో కేరళ స్టార్ ను బోల్తా కొట్టించాడు. తాజాగా అహ్మదాబాద్ వేదికగా జరిగిన కీలక మ్యాచ్ లో సత్తా చాటాడు. రషీద్ ఖాన్ 4 ఓవర్లలో 27 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీస్తే నూర్ అహ్మద్ 4 ఓవర్లలో 37 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు.