Nora Fatehi : కావాల‌ని న‌న్ను ఇరికించారు – నోరా

కోర్టులో న‌టి ఫ‌తేహి కామెంట్స్

Nora Fatehi : బాలీవుడ్ న‌టి నోరా ఫ‌తేహి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వారి అవ‌స‌రాల కోసం త‌న‌ను బ‌లి ప‌శువును చేశారంటూ ఆరోపించింది. సోమ‌వారం ఆమె కోర్టుకు హాజ‌రయ్యారు. ఆర్థికంగా న‌ష్ట పోయాన‌ని, అంతే కాకుండా ఎక్కువ‌గా త‌న ప్ర‌తిష్ట‌కు భంగం క‌లిగింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ , వివిధ మీడియా సంస్థ‌ల‌పై ప‌రువు న‌ష్టం కేసు వేశారు నోరా ఫ‌తేహి.

Nora Fatehi Emotion

ఈ కేసుకు సంబంధించి పాటి యాలా లోని మెట్రో పాలిట‌న్ మెజిస్ట్రేట్ కపిల్ గుప్తా ముందు ఆమె(Nora Fatehi) త‌న వాంగ్మూలాన్ని న‌మోదు చేశారు. త‌ప్పుడు క‌థ‌నాలు ప్ర‌సారం చేశారు. నాపై త‌ప్పుడు రాత‌లు రాశారు. వాటికి ఎక్క‌డా ఆధారాలు లేవు. ఇలాగేనా వ్య‌వ‌హ‌రించేది. సినీ రంగం అంటేనే అదేదో త‌ప్పుడు ప‌నులు చేస్తున్న‌ట్టు చిత్రీక‌రించే ప్ర‌య‌త్నం జ‌రుగుతోందంటూ ఆవేద‌న చెందారు నోరా ఫ‌తేహి.

పొద్ద‌స్త‌మానం త‌మ గురించి గాసిప్స్ రాయ‌క పోతే, ఏదో ఒక‌టి అల్ల‌క పోతే మీడియాకు డ‌బ్బులు ఎలా వ‌స్తాయంటూ ఎదురు దాడికి దిగింది. వారంతా నాకు ఓ పేరు కూడా పెట్టార‌న్నారు. సుకేష్ చంద్ర‌శేఖ‌ర్ పై 200 కోట్ల రూపాయ‌ల‌ను స్వాహా చేశార‌న్న ఆరోప‌ణ‌ల‌తో ఈడీ కేసు న‌మోదు చేసింద‌ని , నాకు ఏమైనా తెలుసా అని క‌న్నీటి ప‌ర్యంతం అయ్యింది.

ఇలాంటి ప్ర‌సారాల వ‌ల్ల త‌న కెరీర్ కు పెద్ద దెబ్బ త‌గిలింద‌ని వాపోయారు. దురుద్దేశ పూరిత కార‌ణాల‌తో కేసు న‌మోద‌య్యేలా చేశారంటూ ఆరోపించారు నోరా ఫ‌తేహి.

Also Read : BRO Movie : కాసుల వ‌ర్షం బ్రో చిత్రం 3 రోజుల్లో రూ. 75.06 కోట్లు

Leave A Reply

Your Email Id will not be published!