Nora Fatehi ED : నోరా ఫతేహిని ప్రశ్నించిన ఈడీ
రూ. 200 కోట్ల అక్రమ కేసులో విచారణ
Nora Fatehi ED : అక్రమాస్తులపై రూ. 200 కోట్ల దోపిడీ కేసులో నటి నోరా ఫతేహిని ప్రశ్నించింది కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ). మనీ లాండరింగ్ పై అనుమానంతో ఈడీ గతంలో సుకేష్ చంద్రశేఖర్ తో పాటు ఫతేహీలను కలిసి ప్రశ్నించింది.
జైలు శిక్ష అనుభవిస్తున్న నాన్ మన్ సుకేష్ చంద్రశేఖర్ తో ముడి పడి ఉంది ఈ కేసు. బాలీవుడ్ నటి ఫతేహిని(Nora Fatehi ED) ఢిల్లీ పోలీసులు నాలుగు గంటల పాటు ప్రశ్నించారు.
ఈ కేసులో సాక్షిగా నోరా ను ఆర్థిక నేరగాల విభాగం ప్రశ్నించింది. అంతకు ముందు బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్(Jacqueline Fernandez) అప్పిలేట్ అథారిటీ ముందు సమర్పించిన పిటిషన్ లో స్పష్టంగా పేర్కొంది.
తనతో పాటు చంద్రశేఖర్, నోరా ఫతేహి కూడా ఉన్నారు. కాగా ఆమెకు ఎలాంటి సంబంధం లేదంటూ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పేర్కొంటోంది.
దొపిడీ కేసు మనీ ట్రయిల్ లో ఈడీ ఛార్జ్ షీట్ లో ఈ విచారణ కూడా ఒక భాగం. ఇంతకు ముందు విచారణలో దర్యాప్తు ఏజెన్సీని ప్రశ్నించినప్పుడు నోరా ఫతేహి డిసెంబర్ 12, 2020కి ముందు కాన్ మ్యాన్ చంద్రశేఖర్ తో మాట్లాడలేదని ఖండించింది.
కాగా సుకేష్ చంద్రశేఖర్ రెండు వారాల ముందు తనతో మాట్లాడినట్లు ఈడీ గుర్తించింది. ఇదిలా ఉండగా తమిళనాడు కోర్టు ముందు హాజరయ్యేందుకు సుకేష్ కు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది.
కాగా సుకేష్ చంద్రశేఖర్ ఫార్మాస్యూటికల్ దిగ్గజం రాన్ బాక్సీ మాజీ ప్రమోటర్లు ఆదితి సింగ్ , శివేందర్ సింగ్ నుండి సుమారు రూ. 215 కోట్లు దోపిడీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Also Read : బిల్కిస్ దోషుల విడుదల సిగ్గు చేటు