North Korea Missile : ఉత్త‌ర కొరియా క్షిప‌ణి ప్ర‌యోగం

ఆందోళ‌న‌లో జ‌పాన్ , ద‌క్షిణ కొరియా

North Korea Missile  : ప్ర‌పంచ వ్యాప్తంగా ఏం జ‌రుగుతుందో ఎప్పుడు ఏమ‌వుతుందో చెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. ప్ర‌పంచంపై ఆధిప‌త్యం కోసం అమెరికా, చైనా, ర‌ష్యా పోటీ ప‌డుతున్నాయి.

ఇప్ప‌టికే గ‌త 10 రోజులుగా ఎడ‌తెరిపి లేకుండా ర‌ష్యా ఉక్రెయిన్ పై యుద్దం చేస్తోంది. ఈ ఘ‌ట‌న‌లో 2 వేల మందికి పైగా మ‌ర‌ణించారు. వంద‌లాది భ‌వ‌నాలు నేల‌మ‌ట్టం అయ్యాయి.

రియాక్ట‌ర్ల‌ను పేల్చి వేసింది ర‌ష్యా. ప‌రిస్థితి అత్యంత హృద‌య విదార‌కంగా ఉంది. ఈ త‌రుణంలో మ‌రో బాంబు పేల్చాడు ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్ జోంగ్ ఉన్.

ఓ వైపు దేశంలో మ‌నుషులు ఆక‌లి చావుల‌తో ఆల్లాడుతుంటే తానేమో క్షిప‌ణులు ప్ర‌యోగిస్తూ(North Korea Missile )దూసుకెళుతున్నాడు. ఇప్ప‌టి దాకా ఎనిమిదికి పైగా క్షిప‌ణులు ప్ర‌యోగించాడు.

ఇవాళ మ‌రోసారి క్షిప‌ణి ప్ర‌యోగం చేయ‌డంతో ఒక్క‌సారిగా యావ‌త్ ప్ర‌పంచం విస్తు పోయింది. కిమ్ దెబ్బ‌కు అటు ద‌క్షిణ కొరియా ఇటు జ‌పాన్ బెంబేలెత్తి పోతున్నాయి.

ప్ర‌శాంతంగా ఉన్న వాతావ‌ర‌ణాన్ని చెడ‌గొట్ట‌డం ప్రారంభించంతో ఆయా దేశాల‌కు సంబంధించిన ప్ర‌జ‌లు కంటి మీద కునుకు లేకుండా ఆక‌లం వెళ్ల దీస్తున్నారు.

ఇంకో వైపు దేశాల‌న్నీ ఈ ప్ర‌యోగం ఆపాల‌ని కోరినా ప‌ట్టించు కోవ‌డం లేదు కిమ్. ప్ర‌స్తుతం అమెరికా, ఉత్త‌ర కొరియా దేశాల మ‌ధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.

ఇదిలా ఉండ‌గా కిమ్ ఈ ఒక్క ఏడది లోనే 9 క్షిప‌ణులు ప్ర‌యోగించారంటూ ద‌క్షిణ కొరియా ఆరోపించింది. ఈనెల 9న ద‌క్షిణ కొరియాలో అధ్య‌క్ష ప‌ద‌వికి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ త‌రుణంలో క్షిప‌ణి ప్ర‌యోగం క‌ల‌క‌లం రేపింది.

Also Read : యుద్దానికి విరామం తాత్కాలిక ఉప‌శ‌మ‌నం

Leave A Reply

Your Email Id will not be published!