Nirmala Sitharaman : డిజిట‌ల్ చెల్లింపుల ఛార్జీల‌పై కామెంట్స్

ఛార్జీల పెంపుపై ఇది స‌రైన స‌మ‌యం కాదు

Nirmala Sitharaman :  దేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ షాకింగ్ కామెంట్స్ చేశారు. గ‌త కొంత కాలంగా డిజిట‌ల్ చెల్లింపుల‌పై కూడా జీఎస్టీ పేరుతో వ‌డ్డిస్తార‌నే జోరుగా ప్ర‌చారం జ‌రిగింది.

ఈ త‌రుణంలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు విత్త మంత్రి. డిజిట‌ల్ చెల్లింపుల‌ను వ‌సూలు చేసేందుకు ఇది స‌రైన స‌మ‌యం కాద‌ని ప్ర‌భుత్వం విశ్వ‌సిస్తోంద‌ని స్ప‌ష్టం చేశారు.

ఒక కార్య‌క్ర‌మంలో నిర్మ‌లా సీతారామ‌న్(Nirmala Sitharaman)  మాట్లాడారు. త‌మ ప్ర‌భుత్వం డిజిట‌ల్ చెల్లింపుల‌ను ప్ర‌జా ప్ర‌యోజ‌నంగా చూస్తోంద‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌జ‌లు దానిని స్వేచ్ఛ‌గా వాడుకునేలా ఉండాల‌న్నారు.

త‌ద్వారా భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ కు సంబంధించిన డిజిట‌లైజేష‌న్ ఆక‌ర్ష‌ణీయంగా మారుతుంద‌న్నారు. దీని ద్వారా ఒక స్థాయి పార‌ద‌ర్శ‌క‌త‌ను సాధిస్తామ‌న్నారు.

ఇది పూర్తిగా అమ‌లు లోకి రావాలంటే వీటి లావాదేవీల నిర్వ‌హ‌ణ‌పై ఛార్జ్ (చెల్లింపులు) ఇది స‌రైన స‌మ‌యం కాద‌ని తాము ఇప్ప‌టికీ భావిస్తున్నామ‌ని నిర్మ‌లా సీతారామ‌న్ చెప్పారు.

ఓపెన్ డిజిట‌ల్ లావాదేవీలు, డిజిట‌లైజేష‌న్ , గొప్ప యాక్సెస్ ను ప్రారంభించ‌గ‌ల ప్లాట్ ఫార‌మ్ ల వైపు మ‌రింత ముందుకు సాగుతున్నామ‌న్నారు. ఆర్బీఐ చేసిన సిఫార‌సును అనుమ‌తిస్తుంద‌న్నారు.

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంట‌ర్ ఫేస్ (యూపీఐ) ద్వారా జ‌రిగే లావాదేవీల‌పై టైర్డ్ ఛార్జీలు విధించే అవ‌కాశంతో స‌హా చెల్లింపుల వ్య‌వ‌స్థ‌లో ప్ర‌తిపాదించిన వివిధ మార్పుల‌పై ప్రజ‌ల నుండి ఆర్బీఐ అభిప్రాయాలు కోరుతోంది.

ఈ త‌రుణంలో ఆర్థిక మంత్రి ప్ర‌క‌ట‌న చేశారు. అయితే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంట‌ర్ ఫేస్ సేవ‌ల‌పై ఎలాంటి ఛార్జీలు విధంచ‌బోమ‌ని భార‌త ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

Also Read : దేశంలో 21 న‌కిలీ యూనివ‌ర్శిటీలు

Leave A Reply

Your Email Id will not be published!