Nupur Sharma : నూపుర్ శర్మ వల్ల దేశానికి పెను ముప్పు
చీఫ్ జస్టిస్ సంచలన కామెంట్స్
Nupur Sharma : ఇవాళ దేశ వ్యాప్తంగా బీజేపీ బహిష్కృత నాయకురాలు నూపుర్ శర్మ(Nupur Sharma) చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఆమె తనకు రక్షణ లేదంటూ , అన్ని కేసులను ఢిల్లీకి బదలాయించాలంటూ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారించింది.
ఈ సందర్భంగా కేసును కొట్టి వేసింది. విచారించిన ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒక్కసారిగా ఎవరీ చీఫ్ జస్టిస్ అంటూ చర్చ మొదలైంది.
ఒక రకంగా నూపర్ శర్మపై మండిపడ్డారు. ఆమెకు ముప్పు ఏమీ లేదని కానీ నూపుర్ శర్మ వల్ల దేశానికి పెను ముప్పు ఏర్పడిందంటూ వ్యాఖ్యానించారు. నోటి దురుసుతో దేశాన్ని అగ్నిగుండంగా మార్చేసిందన్నారు.
ఇదిలా ఉండగా చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. భావోద్వేగాలను కావాలని రెచ్చగొట్టారు. దేశంలో దురుదృష్టకరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి.
వాటన్నింటికీ ఆమెనే బాధ్యురాలు. ఉదయ్ పూర్ లో టైలర్ హత్యకు కూడా నూపుర్ శర్మనే (Nupur Sharma)కారణం. దేశంలో నిప్పు రాజేసినందుకు ఆమె ఏ టీవీలోనైతే కామెంట్స్ చేసిందో దాని ముందే వచ్చి దేశానికి, ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆదేశించారు.
10 ఏళ్లుగా లాయర్ గా పని చేసినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారు. అలాంటి వ్యక్తి ఇలా మాట్లాడడం దారుణమన్నారు. చీప్ పబ్లిసిటీ , రాజకీయ ఎజెండా కోసం ఇలా మాట్లాడతారా అంటూ ప్రశ్నించారు.
ఆమెకు ముప్పు ఉందని అంటున్నారు. కానీ ఆమె వల్ల దేశానికి ప్రమాదం ఏర్పడిందన్నారు. పార్టీ ప్రతినిధి అయితే ఇష్టానుసారంగా మాట్లాడతారా అంటూ ప్రశ్నించారు చీఫ్ జస్టిస్.
ప్రజాస్వామ్యంలో పెరిగేందుకు గడ్డికి కూడా హక్కు ఉన్నట్లే తినేందుకు గాడిదకు కూడా హక్కు ఉందన్నారు.
Also Read : ఢిల్లీ పోలీస్ తీరుపై ‘సుప్రీం’ సీరియస్