NV Ramana Comment : ప‌ద‌వికి వ‌న్నె తెచ్చిన ఎన్వీ ర‌మ‌ణ

కీల‌క తీర్పులే కాదు మార్పులకు శ్రీ‌కారం

NV Ramana Comment : భార‌త స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా కొలువు తీరిన జ‌స్టిస్ నూత‌ల‌పాటి వెంక‌ట ర‌మ‌ణ ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు. కొంద‌రికి ప‌ద‌వి వ‌ల్ల గౌర‌వం వ‌స్తుంది.

కానీ ప‌ద‌వికి ఆయ‌న వ‌ల్ల గౌర‌వం తీసుకు వ‌చ్చేలా త‌న‌ను తాను మ‌ల్చుకున్నారు ఎన్వీ ర‌మ‌ణ(NV Ramana). ఏపీ రాష్ట్రంలోని ఓ మారుమూల ప‌ల్లె పొన్న‌వ‌రం.

సామాన్య రైతు కుటుంబం నుంచి వ‌చ్చిన ఆయ‌న గురించి ఎంత చెప్పినా త‌క్కువే. చిన్న‌ప్ప‌టి నుంచీ కుటుంబ‌మ‌న్నా, బాంధ‌వ్యాల‌న్నా ,సంస్కృతి సాంప్ర‌దాయాల‌న్నా ఎన‌లేని అభిమానం.

అంత‌కంటే అత్యున్న‌త స్థాయిని అలంక‌రించినా ఏనాడూ భేష‌జాలు ప్ర‌ద‌ర్శించ‌ని అద్భుత‌మైన వ్య‌క్తిత్వం క‌లిగిన వారు ఎన్వీ ర‌మ‌ణ‌. ఆయ‌న‌కు

మాతృ భాష అంటే అతులేని మ‌మ‌కారం.

అంత‌కంటే ఎక్కువ‌గా చ‌చ్చేంత ఇష్టం కూడా. అవ‌స‌ర‌మైతే త‌ప్పా ఇంగ్లీష్ ను మాట్లాడ‌రు. ఎవ‌రైనా త‌మ భాష ప‌ట్ల ప్రేమ, ఆస‌క్తి క‌లిగి ఉంటారో వారు అద్భుత‌మైన విజ‌యాలు సాధిస్తార‌ని, స్పూర్తి దాయ‌కంగా నిలుస్తారంటారు.

ఎంత సంపాదించినా, ఎన్ని దేశాలు తిరిగినా మాతృ భాష‌ను మ‌రిచి పోకూడ‌దంటూ సెల‌విస్తారు. ప్ర‌పంచంలోనే అత్యున్న‌తమైన  ప్ర‌జాస్వామ్యానికి వేదిక‌గా, ప్ర‌తీక‌గా నిలిచిన 133 కోట్ల భార‌త దేశానికి ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా (NV Ramana) కొలువు తీరారు.

ఆశించిన దానికంటే ఎక్కువే చేశారు. ప‌డుతూ లేస్తూ వ‌స్తున్న న్యాయ వ్య‌వ‌స్థ‌కు జీవం పోసేందుకు ప్ర‌య‌త్నం చేశారు. ఆయ‌న కేంద్రంతో

ప‌దే ప‌దే మౌలిక వ‌స‌తులు కల్పించాల‌ని కోరుతూ వ‌చ్చారు.

సంచ‌ల‌న తీర్పుల‌కు కేంద్ర బిందువ‌య్యారు. ఆపై దేశం ఎలా ఉండాలో, ప్ర‌జ‌ల‌కు స్వేచ్ఛ ఎంత‌టి ముఖ్య‌మైన హ‌క్కు, అవ‌స‌ర‌మో స్ప‌ష్టం చేశారు.

భార‌త రాజ్యాంగం ప‌ట్ల‌, హ‌క్కుల ప‌ట్ల ఎరుక ఉండాల‌ని, న్యాయం అన్న‌ది ప్ర‌తి సామాన్యుడికి అందినప్పుడే అస‌లైన డెమోక్ర‌సీ ఉన్న‌ట్లు అని ప్ర‌క‌టించిన ధీశాలి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌.

2021 ఏప్రిల్ 24న ఆయ‌న భార‌త దేశ ప్ర‌ధాన న్యాయూమ‌ర్తిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన ఆయ‌న త‌న‌దైన ముద్ర‌ను క‌న‌బ‌ర్చారు. సీజేఐ

ప‌ద‌వికి వ‌న్నె తీసుకు వ‌చ్చారు.

ఇందులో ఎన్వీ ర‌మ‌ణ స‌క్సెస్ అయ్యారు. వ‌య‌స్సు 64 ఏళ్లు. జ‌ర్న‌లిస్ట్ గా ప్రారంభ‌మైన ఆయ‌న కెరీర్ న్యాయ‌వాదిగా, హైకోర్టు జ‌డ్జిగా..ఇలా

ఎన్నో ఉన్న‌త ప‌ద‌వులు చేప‌ట్టారు.

రాజ్యాంగ ప‌ర‌మైన, క్రిమిన‌ల్, స‌ర్వీస్ , అంత‌ర్ రాష్ట్ర న‌దీ జ‌లాల సంబంధిత కేసుల్ని వాదించ‌డంలో దిట్ట‌గా పేరొందారు. విదేశాల‌లో

ప‌లు న్యాయ స‌ద‌స్సుల‌లో కీల‌క ప్ర‌సంగాలు చేశారు.

సీజేఐగా గ‌తంలో తెలుగు వాడు కోకా సుబ్బారావు ప‌ని చేస్తే రెండో తెలుగు వ్య‌క్తి ఎన్వీ ర‌మ‌ణ‌. చైనా, జ‌పాన్ ల‌లో ఆంగ్లానికి ప్ర‌యారిటీ లేద‌ని వాళ్ల 

భాష‌ల్లోనే ప‌రిణతి చెందార‌ని పేర్కొన‌డం అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించింది.

13 ఏళ్ల సుదీర్ఘ ప్ర‌యాణంలో జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ 60 వేల‌కు పైగా కేసుల‌ను ప‌రిష్క‌రించారు. రిజర్వేష‌న్లు కులాలు, మ‌తాల ఆధారంగా

కాకుండా ఆర్థిక అస‌మాన‌త‌ల ప‌రంగా ఉండాల‌న్నారు.

చెరువులు, కుంట‌ల ప‌రీవాహ‌క ప్రాంతాల్లో నిర్మాణ‌లు వ‌ద్ద‌ని, అట‌వీ విస్తీర్ణం పెంచాల‌ని తీర్పు చెప్పారు. ఇంట‌ర్నెట్ అందుబాటులో ఉండ‌డం అన్న‌ది పౌరుల ప్రాథ‌మిక హ‌క్కు అని స్ప‌ష్టం చేశారు.

ఏది ఏమైనా తెలుగు వారంద‌రికీ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ గ‌ర్వ‌కార‌ణం. ఆయ‌న‌కు స‌లాం.

Also Read : ఓటు వేయండి ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడండి

Leave A Reply

Your Email Id will not be published!