NZ vs ENG 2nd Test : కీవీస్ అద్బుతం ఒక్క ప‌రుగుతో విజ‌యం

ఇంగ్లండ్ ను ఓడించిన న్యూజిలాండ్

NZ vs ENG 2nd Test : విజ‌యం అడుగు దూరంలో ఉంటే ఆ టెన్ష‌న్ వేరుగా ఉంటుంది. ఒక్క ప‌రుగు అని తీసి వేయాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే ఆ ఒక్క ప‌రుగే జ‌ట్టును గెలిపించ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించక మాన‌దు. ఇంగ్లండ్ , న్యూజిలాండ్ జ‌ట్ల(NZ vs ENG 2nd Test)  మ‌ధ్య జ‌రిగిన రెండో టెస్టు ఆద్యంత‌మూ ఆస‌క్తిక‌రంగా..ఉత్కంఠ భ‌రితంగా సాగింది. కీవ‌స్ జ‌ట్టు కేవ‌లం ఒకే ఒక్క ప‌రుగు తేడాతో అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. రెండు టెస్టుల సీరీస్ ను స‌మం చేసింది.

ఈ గెలుపులో మ‌రోసారి కీల‌క‌మైన ఇన్నింగ్స్ ఆడాడు, నిజ‌మైన క్రికెట‌ర్ న‌ని త‌న‌ని తాను నిరూపించుకున్నాడు కేన్ విలియ‌మ్స‌న్. తీవ్ర‌మైన ఒత్తిడి ఉన్న‌ప్పుడు , జ‌ట్టు క‌ష్టాల‌లో ఉన్న స‌మ‌యంలో ఎక్క‌డా ఒత్తిడికి లోను కాకుండా ఆడ‌డంలో కేన్ విలియమ్స‌న్ త‌ర్వాతే ఎవ‌రైనా. కీల‌క‌మైన రెండో టెస్టులో అదే చేశాడు. మ్యాచ్ ను పూర్తిగా తిప్పేశాడు. తాను అస‌లైన ప్లేయ‌ర్ న‌ని నిరూపించాడు.

విలియ‌మ్స‌న్ అద్భుత‌మైన సెంచ‌రీతో ఆక‌ట్టుకున్నాడు. రెండో ఇన్నింగ్స్ లో 483 ర‌న్స్ కు ఆలౌటైంది. ఇందులో విలియ‌మ్స‌న్ చేసిన 132 ర‌న్స్ ఉన్నాయి. వెల్లింగ్ట‌న్ లో జ‌రిగిన ఈ టెస్టులో ఇంగ్లండ్ ముందు 258 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యాన్ని నిర్దేశించాడు. ఇక విలియ‌మ్స‌న్ తో పాటు టామ్ బ్లండెన్ 90 ప‌రుగుల వ‌ద్ద చివ‌రి ఆట‌గాడిగా వెనుదిరిగాడు. ఇక ఇంగ్లండ్ 257 ప‌రుగుల‌కే చాప చుట్టేసింది. దీంతో ఒక్క ప‌రుగు తేడాతో న్యూజిలాండ్ గ్రాండ్ విక్ట‌రీని న‌మోదు చేసింది.

Also Read : దాదా బౌలింగ్ క‌పూర్ సిక్స‌ర్

Leave A Reply

Your Email Id will not be published!