Used Smart Phones : ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ల మార్కెట్ లో ఎక్కువగా ఉపయోగిస్తున్నది భారతీయులే. టెక్నాలజీ తో పాటు కరోనా కారణంగా ఫోన్ల వాడకం తప్పనిసరిగా మారింది.
ఈ తరుణంలో ఫస్ట్ హ్యాండ్ స్మార్ట్ ఫోన్ల కంటే ఈ దేశంలో అత్యధికంగా స్మార్ట్ ఫోన్లు విక్రయించడం విశేషం. కోట్లాది మంది వినియోగదారులు సెకండ్ హ్యాండ్ ఫోన్లనే(Used Smart Phones )ప్రిఫర్ చేస్తున్నట్లు తాజాగా నివేదికలో వెల్లడైంది.
ఇదిలా ఉండగా ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే సెకండ్ హ్యాండ్ స్మార్ట్ ఫోన్ (Used Smart Phones )మార్కెట్ వచ్చే 2025 నాటికి $4.6 బిలియన్లకు చేరుకుంటుందని ఐసీఈఏ – ఐడీసీ నివేదిక స్పష్టం చేసింది.
ప్రపంచంలో అత్యధికంగా ఆ ఫోన్లను వాడే వారిలో 95 శాతానికి పైగా ఇండియాలోనే కొనుగోలు చేస్తుండడం విశేషం. ఇప్పటి దాకా సెకండ్ హ్యాండ్ మార్కెట్ లో వినియోగదారులు ఏకంగా 25 మిలియన్ల స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేశారు.
ఇదిలా ఉండగా ఇండియాలో కేవలం 5 శాతం మాత్రమే స్మార్ట్ ఫోన్లు కొన్ని మైనర్ రిపేర్ లకు గురవుతున్నాయి. దీంతో భారత్ విషయానికి వస్తే అత్యధిక మార్కెట్ గ్రామీణ ప్రాంతాల్లో ఉంది.
పట్టణాల కంటే రూరల్ మార్కెట్ పై పట్టు సాధించేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. ప్రత్యేకించి కోట్లాది మంది పేదలుగా ఉండడం కూడా వీటిని కొనుగోలు చేసేందుకు ప్రధాన కారణమని సదరు నివేదిక పేర్కొంది.
వీటి మార్కెట్ విలువ దాదాపు రూ. 17 వేల 250 కోట్లుగా ఉందని స్పష్టం చేసింది. ఇక సెకండ్ హ్యాండ్ పరంగా చూస్తే స్మార్ట్ ఫోన్లతో పాటు ల్యాప్ టాప్ లు, స్మార్ట్ వాచ్ లు , యాక్సెసరీస్ ఎక్కువగా అమ్ముడు పోతున్నాయని నివేదిక వెల్లడించింది.
Also Read : ఇక భవిష్యత్తు ఎయిర్ ఇండియాదే