Olympics 2024 : వినీష్ ఫోగట్ పై అనర్హత వేటు వేయడంపై స్పందించిన ప్రధాని
50 కేజీల విభాగంలో వినేశ్ ఫోగట్ నిర్ణీత బరువు పెరిగారు...
Olympics 2024 : ఒలింపిక్స్‌లో ఫైనల్ కు చేరిన రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడడంపై ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు. వినేశ్.. నువ్వు చాంపియన్లకే చాంపియన్. నీవు భారత్‌కే గర్వకారణం. అలాగే ప్రతీ భారతీయకుడికి నీవు స్పూర్తిదాయం. ఈ రోజు నీకు తగిలిన ఎదురు దెబ్బ తనను బాగా బాధిస్తుంది. దీనిని వ్యక్తం చేసేందుకు తన వద్ద మాటలు సైతం లేవు. ఈ బాధ నుంచి తిరిగి బయటకు రాగలవని ఆశిస్తున్నాను. సవాళ్లను ఎదిరించడం నీకు తెలుసు. ఆ క్రమంలో నీకు అండగా మేముంటామన్నారు.
Olympics 2024-Vinesh Phogat
50 కేజీల విభాగంలో వినేశ్ ఫోగట్ నిర్ణీత బరువు పెరిగారు. ఉండాల్సిన బరువు కంటే 100 గ్రాములు పెరగడంతో వినేశ్‌పై అనర్హత వేటు పడింది. ఈ మేరకు పారిస్ ఒలింపిక్ నిర్వాహకులు ప్రకటించారు. వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడటంతో క్రీడాభిమానులు భారీ షాక్‌కు గురయ్యారు. బంగారు పతకం సాధించడానికి కేవలం అడుగు దూరంలో ఉండగా ఇలా జరిగిందని సర్వత్ర ఆవేదన వ్యక్తమవుతుంది.
Also Read : Bangladesh Violence : ఢాకా నుండి 205 మందిని సురక్షితంగా తీసుకొచ్చిన భారత సర్కార్