1983 World Cup : 1983 వ‌ర‌ల్డ్ క‌ప్ సాధించి 39 ఏళ్లు

స‌రిగ్గా ఇదే రోజు క‌పిల్ సేన రికార్డ్

1983 World Cup : భార‌త దేశ చ‌రిత్ర‌లో చిర‌స్మ‌ర‌ణీయమైన విజ‌యాన్ని న‌మోదు చేసిన రోజు ఈరోజు. స‌రిగ్గా ఇదే రోజు ఇంగ్లండ్ లోని లార్డ్స్

వేదిక‌గా 1983లో జ‌రిగిన వ‌ర‌ల్డ్ క‌ప్(1983 World Cup) ను హ‌ర్యానా హ‌రికేన్ క‌పిల్ దేవ్ నిఖంజ్ సార‌థ్యంలో సాధించింది.

ప్ర‌పంచ క‌ప్పును గెలుపొంది నేటితో 36 ఏళ్లు అవుతోంది. ఆనాడు సాధించిన ఆ గ్రాండ్ విక్ట‌రీతో భార‌త జ‌ట్టు పేరు ప్ర‌పంచ వ్యాప్తంగా తెలిసి పోయింది.

ఆ ఒక్క విజ‌యం భార‌త దేశ క్రీడా స్వ‌రూపాన్ని మార్చేసింది.

ఒక‌టా రెండా వేలాది మంది ఇప్పుడు క్రికెట్ ను ఆడుతున్నారు. కోట్లాది మంది క్రికెట్ ను శ్వాసిస్తున్నారు. చూస్తున్నారు. అండ‌ర్ డాగ్స్ గా వెళ్లిన

క‌పిల్ దేవ్ సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు ఊహించ‌ని రీతిలో టాప్ లో కొన‌సాగుతున్న వెస్టిండీస్ ను మ‌ట్టి క‌రిపించింది.

ఫైన‌ల్ లో ఊహించ‌ని షాక్ ఇచ్చింది. అప్ప‌టి భార‌త దేశ ప్ర‌ధాన మంత్రి ఇందిరా గాంధీ, ప్రెసిడెంట్ జ్ఞాని జైల్ సింగ్ సాద‌ర స్వాగ‌తం ప‌లికారు.

అంతేనా జాతి యావ‌త్తు సంబురాలు చేసుకుంది.

మువ్వొన్నెల భార‌త ప‌తాకాల‌తో దేశంలో ఉత్స‌వాలు చేసుకున్నారు. కేవ‌లం క్రికెట‌ర్ల కోసం రాజ్ సింగ్ దుర్గార్ పూర్ విన్న‌వించ‌డంతో దిగ్గ‌జ గాయ‌ని ల‌తా మంగేష్క‌ర్ ఢిల్లీలో క‌చేరి చేసింది.

మ్యూజిక్ క‌న్స‌ర్ట్ తో వ‌చ్చిన డ‌బ్బుల్ని క్రికెట‌ర్ల కు ఇచ్చారు. ఇది ఆనాటి ప‌రిస్థితి. కానీ ఆనాటి నుంచి నేటి దాకా క్రికెట్ స్వ‌రూప‌మే మారి పోయింది. బీసీసీఐ ఇప్పుడు ప్ర‌పంచ క్రికెట్ శాసిస్తోంది.

48 వేల కోట్ల‌కు పైగా ఐపీఎల్ రైట్స్ ద్వారా పొందింది. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే స‌రిగ్గా ఇదే రోజు 25 జూన్ 1983లో లార్డ్స్ మైదానం వేదిక‌గా

జ‌రిగిన వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్(1983 World Cup) లో వెస్టిండీస్ ను 43 ప‌రుగుల తేడాతో ఓడించింది.

క్రికెట్ ప్ర‌పంచ క‌ప్ టైటిల్ ను కైవ‌సం చేసుకుంది. ఈ సంద‌ర్భంగా భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి ట్విట్ట‌ర్ లో క‌పిల్ దేవ్ ప్ర‌పంచ క‌ప్

ట్రోఫీని అందుకుంటున్న ఫోటోను షేర్ చేసింది.

ఈ అరుదైన విజ‌యం చిర‌స్మ‌ర‌ణీయంగా ఎల్ల‌ప్ప‌టికీ నిలిచే ఉంటుంద‌ని పేర్కొంది. ఆనాటి జ‌ట్టులో క‌పిల్ దేవ్ కెప్టెన్ కాగా సునీల్ గ‌వాస్క‌ర్ , కృష్ణ‌మాచారి శ్రీ‌కాంత్ , మొహింద‌ర్ అమ‌ర్ నాథ్ , య‌శ్ పాల్ శ‌ర్మ‌, సందీప్ పాటిల్ , కీర్తి ఆజాద్ , రోజ‌ర్ బిన్నీ,

మ‌ద‌న్ లాల్ , స‌య్య‌ద్ కిర్మాణి, బ‌ల్వీంద‌ర్ సంధు ఉన్నారు.

Also Read : భార‌త్ ఐర్లాండ్ టూర్ షెడ్యూల్

Leave A Reply

Your Email Id will not be published!