Opposition Comment : మారిన స్వరం విపక్షాల ఐక్యతా రాగం
పాట్నా వేదికగా 17 పార్టీల మీటింగ్
Opposition Comment : నిన్నటి దాకా ఎవరికి వారు తమకు తోచిన రీతిలో ఉండి పోయారు. కానీ ఇవాళ అంతా ఒకే తాటి పైకి రావాలని నిర్ణయించారు. వారు ఎవరో కాదు దేశంలో కొలువు తీరిన 17 పార్టీల నేతలు. కొందరు పవర్ లో ఉన్నారు. మరికొందరు ప్రతిపక్ష పాత్ర పోషించారు. ఇంకొందరు ఉనికి కోసం ప్రయత్నం చేస్లున్నారు. ఇదంతా పక్కన పెడితే యావత్ దేశం ఎంతో ఉత్కంఠతో ఎదురు చూసింది. ప్రతిపక్షాలన్నీ కలిసి ఏం చేయబోతున్నాయని. కేంద్రంలో కొలువుతీరిన భారతీయ జనతా పార్టీని , అత్యంత శక్తివంతమైన నెట్ వర్క్ కలిగిన మోదీని తట్టుకుని నిలబడాలంటే ఏం చేయాలనే దానిపై చర్చలు జరిగాయి.
ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా విడి పోయిన పార్టీలన్నింటినీ , నేతలను ఒకే గొడుగు కిందకు తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు జేడీయూ చీఫ్ , బీహార్ సీఎం నితీశ్ కుమార్(Nitish kumar). ఇందుకు ఆయనను అభినందించక తప్పదు. ముందు మనం ఐక్యమత్యంగా ఉందామన్న సంకేతాన్ని ఈ దేశానికి, ప్రజలకు తెలియ చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. భారత దేశ రాజకీయాలలో ఇప్పటికే తమదైన ముద్ర వేసిన దిగ్గజ నాయకులు ఇందులో పాలు పంచుకున్నారు. తమ విలువైన అభిప్రాయాలను తెలియ చేశారు.
శివసేన బాల్ థాక్రే పార్టీ చీఫ్ , మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే, ఆయన తనయుడు, ఎంపీ సంజయ్ రౌత్ , టీఎంసీ చీఫ్ , సీఎం మమతా బెనర్జీ, ఆప్ కన్వీనర్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ , డీఎంకే చీఫ్ , తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ , బీహార్ సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar) , మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ , జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ , ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ , మాజీ సీఎం ఫరూక్ అబ్దులాతో పాటు కీలక నేతలు పాల్గొన్నారు. వీరితో పాటు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఉన్నారు.
చివరకు ఈ దేశంలో కులం పేరుతో, మతం పేరుతో, విద్వేషాల పేరుతో రాచరిక పాలన సాగిస్తున్న మోదీ ని గద్దె దించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తమకు వ్యతిరేకంగా తీసుకు వచ్చిన ఆర్డినెన్స్ కు సంబంధించి ఆప్ చీఫ్ కేజ్రీవాల్ కాంగ్రెస్ తో వాగ్వావాదానికి దిగినట్లు సమాచారం. ఇదిలా ఉండగా పాట్నా ఇప్పుడు రాజకీయ పునరేకీకరణకు వేదికగా మారడం విశేషం. మొత్తంగా నితీశ్ కుమార్ చేసిన ప్రయత్నం ఫలించిందని చెప్పక తప్పదు. రాబోయే ఎన్నికలలో ప్రతిపక్షాలన్నీ ముక్త కంఠంతో నినదించడం శుభ పరిణామం అని చెప్పక తప్పదు.
Also Read : DK Shiva Kumar Bommai : బొమ్మైని కలిసిన డీకే