Opposition Partys Comment : ‘క‌త్తుల’ క‌ర‌చాల‌నం క‌ల‌కలం

విప‌క్షాల‌న్నీ ఏకైమ‌న వేళ‌

Opposition Partys Comment : క‌న్న‌డ నాట అరుదైన దృశ్యం ఆవిష్కృత‌మైంది. దేశంలోని ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీల‌న్నీ ఒకే వేదిక‌పైకి రావ‌డం ఆహ్వానించ ద‌గిన ప‌రిణామం. అతిర‌థ మ‌హార‌థులు, త‌ల‌పండిన రాజ‌కీయ నాయ‌కులు, డ‌క్కీ మొక్కీలు అనుభ‌వించిన వారంతా ఒకే చోటుకు చేర‌డం ఆస‌క్తిని రేపుతోంది. ఇది ఒకందుకు మంచిద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. 2014 నుంచి దేశంలో రాజ‌కీయాలు ఒక్కసారిగా మారి పోయాయి. న‌రేంద్ర మోదీ సార‌థ్యంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీ కోలుకోలేని షాక్ ఇచ్చింది. సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర క‌లిగిన 138 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ స‌ర్కార్ కు ఝ‌ల‌క్ ఇచ్చింది. ఆ త‌ర్వాత 2019లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో మ‌రోసారి స‌త్తా చాటింది. తిరిగి మోదీనే పీఎంగా కొలువు తీరారు. ఆనాటి నుంచి నేటి దాకా బీజేపీ, దాని అనుబంధ సంస్థ‌ల‌న్నీ ఆక్టోప‌స్ లా విస్త‌రించాయి. కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు జూలు విదిల్చాయి. కేవ‌లం ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను మాత్ర‌మే సాకుగా తీసుకుని వేధింపుల‌కు పాల్ప‌డ‌డం మొద‌లు పెట్టాయి. వీటిని నిర‌సిస్తూ విప‌క్షాలు పెద్ద ఎత్తున ప్ర‌శ్నించాయి. నిర‌స‌న తెలిపాయి. ఆందోళ‌న బాట ప‌ట్టాయి. చివ‌ర‌కు సుప్రీంకోర్టును కూడా ఆశ్ర‌యించాయి. కానీ అక్క‌డ కూడా విప‌క్షాల‌కు చుక్కెదురైంది.

ఈ త‌రుణంలో ఎవ‌రికి వారే య‌మునా తీరే అన్న చందంగా ఆయా పార్టీలు వ్య‌వ‌హ‌రించాయి. కేసులు, అరెస్ట్ లు, వేధింపులు, జైళ్లు ష‌రా మామూలుగా మారి పోయాయి. ఆప్ , ఎస్డీఎం; శివ‌సేన‌, జేడీఎస్ , జేడీయూ , బీఆర్ఎస్ , స‌మాజ్ వాది పార్టీ, బీఎఎస్పీ, వైసీపీ, టీఎంసీ, జేఎన్ఎం, జేడీయూ , ఎన్సీపీ, ఎంఐఎం, సీపీఎం, ఆర్డీఎల్ , కాంగ్రెస్ పార్టీ లు త‌మ త‌మ దారుల్లో నిమ‌గ్న‌మై పోయాయి. ఆక్టోప‌స్ లో విస్త‌రిస్తూ పోయిన మోదీని ఢీకొనాలంటే ఏకం కావాల‌ని నిర్ణ‌యానికి(Opposition Partys Comment) వ‌చ్చాయి. బీఆర్ఎస్, ఆప్ , టీఎంసీ, వైసీపీ బీజేపీకి బి- టీమ్ లుగా ప‌ని చేస్తున్నాయ‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎక్క‌డా బలోపేతం కాకుండా చూడాల‌న్న‌దే బీజేపీ ప్లాన్. అమిత్ షా, మోదీ, జేపీ న‌డ్డా ప్రీ ప్లాన్ గా నరుక్కుంటూ వెళుతున్నారు. అన్ని అస్త్రాల‌ను ప్ర‌యోగిస్తున్నారు. ద‌క్షిణాదిన ఆ పార్టీ విస్త‌రించాల‌ని ప్లాన్ చేసింది. కానీ తాజాగా క‌ర్ణాట‌క‌లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్లాన్ వ‌ర్క‌వుట్ కాలేదు. మోదీ ముందుండి ప్ర‌చారం చేసినా ఫ‌లితం లేకుండా పోయింది.

కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా భారీ మెజారిటీని సాధించింది. ఏకంగా 136 సీట్ల‌ను కైవ‌సం చేసుకుంది. బీజేపీకి గ‌ట్టి షాక్ ఇచ్చింది. విపక్షాల‌కు క‌నువిప్పు క‌లిగించాయి ఈ ఫ‌లితాలు. ప్ర‌జ‌లు ఎళ్ల‌కాలం కులం, మ‌తం, విద్వేషం ప్రాతిపదిక‌న ఓట్లు వేయ‌ర‌ని తేలిపోయింది. తాజాగా క‌ర్ణాట‌క ప్ర‌మాణ స్వీకారం కార్య‌క్ర‌మానికి విప‌క్షాల‌న్నీ ఒకే వేదిక‌పైకి వ‌చ్చాయి. డీఎంకే, సీపీఎం, సీపీఐ, శివ‌సేన‌, ఎన్సీపీ, త‌దిత‌ర(Opposition Partys ) పార్టీల‌న్నీ హాజ‌ర‌య్యాయి. కాంగ్రెస్ పార్టీకి సంఘీభావం ప్ర‌క‌టించాయి. సీఎంలు ఎంకే స్టాలిన్ , నితీశ్ కుమార్ ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. నటుడు క‌మ‌ల్ హాస‌న్ సెంట‌ర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. తాజాగా జేడీయూ చీఫ్‌, బీహార్ సీఎం నితీశ్ కుమార్ క‌లిపే ప్ర‌య‌త్నంలో నిమ‌గ్న‌మ‌య్యారు. తాజాగా విపక్షాల‌న్నీ క‌లిసి ఒకే వేదిక‌పై తాము క‌లిసే ఉన్నామ‌ని సందేశం ఇచ్చారు. ఇదే దేశానికి కావాల్సింది. క‌లిస్తే బ‌లం విడిపోతే బ‌ల‌హీనం అని గుర్తిస్తే మంచిది.

Also Read : Nara Lokesh

Leave A Reply

Your Email Id will not be published!