India Poster : దేశంలో రాజకీయాలు మరింత వేడిని రాజేస్తున్నాయి. నువ్వా నేనా అన్న రీతిలో మాటల యుద్దం కొనసాగుతోంది. ఓ వైపు కేంద్రంలో కొలువు తీరిన ఎన్డీయే ఇంకో వైపు విపక్షాల కూటమి మధ్య విమర్శలు మొదలయ్యాయి. బీజేపీకి వ్యతిరేకంగా 26 పార్టీలతో కూడిన విపక్షాల కూటమి బెంగళూరులో కీలక సమావేశం నిర్వహించింది.
India Poster Release
సంచలన నిర్ణయం తీసుకున్నారు. విపక్షాల కూటమికి ఇండియా అని పేరు పెట్టారు. ఇండియన్ నేషనల్ డెవలప్ మెంటల్ ఇంక్లూసివ్ అలయన్స్ (ఇండియా) పేరు తో పోస్టర్(India Poster) విడుదల చేశారు. దీనిని అప్పటికప్పుడు డిజైన్ చేసి ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఇండియా పేరు ట్రెండింగ్ లో కొనసాగుతోంది.
అయితే ఎవరు కన్వీనర్ గా కొనసాగుతారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ఒక కొలిక్కి వచ్చిందని చెప్పక తప్పదు. ఇక ఎన్డీయేలో భాగస్వామ్యం పంచుకోక పోయినా బయటి నుంచి మద్దతు ఇస్తున్నాయి జగన్ రెడ్డి వైసీపీ, కేసీఆర్ బీఆర్ఎస్. ఈ రెండు పార్టీలను ఆహ్వానించలేదు ఏఐసీసీ. మొత్తంగా విపక్షాల కూటమిని సక్సెస్ చేయడంలో కీలక పాత్ర పోషించారు బీహార్ సీఎం నితీశ్ కుమార్.
మోదీ నియంతృత్వానికి వ్యతిరేకంగా ఇండియా పని చేస్తుందని ఈ సందర్బంగా ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఇవాళ దేశంలో డెమోక్రసీ ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. భావ సారూప్యత కలిగిన పార్టీలన్నీ కలిసి ఒకే వేదికపైకి వచ్చాయని తెలిపారు.
Also Read : Nara Lokesh : ఏపీలో జగన్ అరాచక పాలన – లోకేష్