Osmania University : ఓయూ సంచలన నిర్ణయం
అటానమస్ కాలేజీలకు పీహెచ్డీ అవకాశం
Osmania University : ఉన్నత చదువులు చదవాలని అనుకునే అభ్యర్థులు, విద్యార్థులకు మేలు చేకూర్చేలా ఖుష్ కబర్ చెప్పింది ఉస్మానియా విశ్వ విద్యాలయం(Osmania University). ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకుంది.
ఇప్పటి వరకు పీహెచ్డీ చేయాలంటే నానా తంటాలు పడాల్సి వచ్చేది. కానీ విద్యా రంగంలో చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా ఓయూ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇందుకు సంబంధించి ఓయూ పరిధిలోని డిగ్రీ, పీజీ, ప్రైవేట్ అటానమస్ కాలేజీల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే పీహెచ్డీ కోర్సులకు పర్మిషన్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
దీని వల్ల పీహెచ్డీ చేయాలని ఉన్నా సీట్లు రాక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు మేలు చేకూరనుంది.
ఆయా కాలేజీల్లో ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎమ్మెల్సీ, ఎంఏ, ఎంకాం, జర్నలిజం, లైబ్రరీ సైన్స్ , న్యాయ శాస్త్రం, ఫిజికల్ ఎడ్యుకేషన్ , లాంగ్వేజెస్ , తదితర కోర్సుల్లో పీహెచ్డీ చేసేందుకు చాన్స్ దొరకనుంది.
ఇందుకు గాను ఆయా కాలేజీల్లో పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఇప్పటి దాకా ఓయూకే పరిమితమైన పీహెచ్ డీ విద్య ఇక నుంచి డిగ్రీ, పీజీ, ప్రైవేట్ అటానమస్ కాలేజీల్లో కొలువు తీరనుంది.
రీసెర్చ్ సెంటర్ల అనుమతి కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసేందుకు ఈనెల 10 వరకు గడువు ఇచ్చింది ఓయూ(Osmania University) ఆయా కాలేజీలకు. ఓయూ ద్వారానే ఈ కోర్సులకు సంబంధించి అడ్మిషన్లు ఇస్తామన్నారు రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ వెల్లడించారు.
కాగా ఎవరైతే అడ్మిషన్లు పొందుతారో వారంతా ఆయా అటానమస్ కాలేజీలకు ఫీజులు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
Also Read : విద్యతోనే వికాసం భవిష్యత్తుకు మార్గం