స్థానిక సంస్థల ఎన్నికలకు 22,800కు పైగా నామినేషన్లు
కీలక ప్రకటన చేసిన రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి లోకేష్
అమరావతి : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. ఏపీ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు 22,800కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయని వెల్లడించారు. విమర్శకులపై ఆయన స్పందిస్తూ ఎన్నికల్లో విజయం అనేది ప్రెస్ మీట్లలో కాదని, క్షేత్రస్థాయిలో ప్రజల మధ్యే లభిస్తుందని గుర్తుంచు కోవాలని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల కోసం రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 22 వేలకు పైగా నామినేషన్లు దాఖలయ్యాయని విద్యాశాఖ మంత్రి తెలిపారు. విమర్శకులపై విమర్శలు గుప్పిస్తూ, అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించే వారు ఒక విషయాన్ని గుర్తుంచు కోవాలని అన్నారు. ఎన్నికల్లో గెలుపు అనేది ప్రెస్ మీట్లలో కాకుండా క్షేత్రస్థాయిలో లభిస్తుందని ఎద్దేవా చేశారు.
ఆంధ్రప్రదేశ్ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలయ్యాయి. అన్ని పార్టీల నుంచి, అన్ని వర్గాల నుంచి, రాష్ట్రంలోని ప్రతి మూల నుంచి అభ్యర్థులు ముందుకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం సజీవంగా, శక్తివంతంగా ఉందనడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు నారా లోకేష్. ఒక్క ఓటు కూడా పడక ముందే అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించే వారు గుర్తుంచు కోవాలన్నారు. ఎన్నికల్లో విజయం ప్రెస్ మీట్లలో కాదు, క్షేత్రస్థాయిలో దక్కుతుందని గుర్తించాలన్నారు. ప్రజల ముందుకు రండి, ప్రజలే నిర్ణయిస్తారు ఎవరు విజేతలనేది. కాగా, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లోక్ భవన్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్‌ను కలిసి, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రక్రియలో కేంద్ర బలగాలను మోహరించేలా, అలాగే మొత్తం ఎన్నికల ప్రక్రియను సీసీటీవీ నిఘాలో ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆయన గవర్నర్‌ను కోరారు.
