UPI Transactions : రూ. 678 కోట్ల‌కు పైగా డిజిట‌ల్ లావాదేవీలు

నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా

UPI Transactions : దేశంలో గ‌ణనీయంగా డిజిట‌ల్ చెల్లింపులు, లావాదేవీలు జ‌రిగాయి. భార‌త ప్ర‌భుత్వం ప్ర‌ధానంగా డిఇట‌ల్ చెల్లింపుల విధానాన్ని ప్ర‌వేశ పెట్టిన త‌ర్వాత మ‌రింత ఆదాయం స‌మ‌కూరుతోంది. లెక్క‌కు మించి న‌గ‌దు లావాదేవీలు కొన‌సాగుతున్నాయి. గ‌త సెప్టెంబ‌ర్ నెల‌లో యూపీఐ లావాదేవీలు 3 శాతం పెరిగి రూ. 678 కోట్ల‌కు చేరుకున్నాయి.

గ‌త నెల‌లో 6.78 బిలియ‌న్ అంటే 678 కోట్లు. ఆగ‌స్టులో రూ. 10.73 ల‌క్ష‌ల కోట్ల నుడి రూ. 11.16 ల‌క్ష‌ల కోట్ల విలువైన లావాదేవీల‌కు అనుగుణంగా కొన‌సాగ‌డం విశేషం. ఇదిలా ఉండ‌గా యూపీఐ వినియోగ‌దారుల మ‌ధ్య ప్రాధాన్య‌తా మోడ్ గా మారుతోంది. ఇది ఉప‌యోగించేందుకు సులువుగా వేగ‌వంతంగా కొనసాగుతోంది.

ఆగ‌స్టు 2020లో యూనిఫైడ్ పేమెంట్ ఇంట‌ర్ ఫేస్ (యూపీఐ)(UPI Transactions) ఆధారిత డిజిట‌ల్ ఆర్థిక లావాదేవీల మొత్తం సంఖ్య రూ. 6.57 బిలియ‌న్లు అంటే సుమారు రూ. 657 కోట్లు అన్న‌మాట‌. ఇక ఎన్పీసీఐ డేటా ప్ర‌కారం గ‌త నెల‌లో 6.78 బిలియ‌న్ లావాదేవీలు ఆగ‌స్టులో రూ. 10.73 ల‌క్ష‌ల కోట్ల నుండి రూ. 11.16 ల‌క్ష‌ల కోట్లు విల‌వైన లావాదేవీల‌కు అనుగుణంగా ఉండ‌డం విశేషం.

జూలైలో భార‌త‌దేశం రూ. 10.62 ల‌క్ష‌ల కోట్ల విలువైన 6.28 బిలియ‌న్ యూపీఐ లావాదేవీల‌ను ప్రాసెస్ చేసింది. ఇక ఎన్సీపీఐ గొడుగు కింద ఉన్న ఇత‌ర చెల్లింపుల ప‌ద్ద‌తుల్లో ఐఎంపీఎస్ ద్వారా త‌క్ష‌ణ ఇంట‌ర్ బ్యాంక్ చెల్లింపులు సెప్టెంబ‌ర్ లో 462.69 మిలియ‌న్లు అంటే 46.27 కోట్లు. గ‌త నెల‌లో 466.91 మిలియ‌న్లు అంటే రూ. 46.69 కోట్లు ఉన్నాయి. జూలైలో ఇది 460.83 మిలియ‌న్లుగా ఉంది.
ఇక ఆధార్ నంబ‌ర్ ఆధారిత లావాదేవీలో సెప్టెంబ‌ర్ లో 102.66 మిలియ‌న్లుగా ఉన్నాయి.

Also Read : 5జీ టెస్టింగ్ మోదీ కారు డ్రైవింగ్ స‌క్సెస్

Leave A Reply

Your Email Id will not be published!