KL Rahul Fine : కేఎల్ రాహుల్ కు జరిమానా
రూ. 12 లక్షల ఫైన్ విధింపు
KL Rahul Fine : ఐపీఎల్ 16వ సీజన్ లో ఫైన్ల వర్షం కురుస్తోంది. స్లో ఓవర్ రేట్ కారణంగా , మరికొందరు కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘించడంతో జరిమానాలు విధిస్తోంది ఐపీఎల్ కమిటీ. ఇప్పటి వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్కిప్పర్ ఫాఫ్ డుప్లెసిస్ కు రూ. 12 లక్షలు, రాజస్థాన్ రాయల్స్ స్కిప్పర్ సంజూ శాంసన్ కు, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ పాండ్యాకు రూ. 12 లక్షల చొప్పున ఫైన్ విధించారు.
తాజాగా ఆ జాబితాలోకి చేరి పోయాడు లక్నో సూపర్ జెయింట్స్ సారథి కేఎల్ రాహుల్ . రాజస్థాన్ లోని జైపూర్ వేదికగా జరిగిన కీలక పోరులో రాజస్థాన్ రాయల్స్ పై 10 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు విజయం సాధించింది.
పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. కాగా స్లో ఓవర్ రేట్ కారణంగా రాహుల్ కు(KL Rahul Fine) రూ. 12 లక్షలు జరిమానాగా విధించినట్లు బీసీసీఐ వెల్లడించింది. ఈ మేరకు గురువారం కీలక ప్రకటన చేసింది. ఇంకోసారి ఇలాగే చేస్తే మరో రూ. 12 లక్షలు కలిపి రూ. 24 లక్షల జరిమానా విధించనున్నట్లు హెచ్చరించింది.
ఇదిలా ఉండగా మినిమం ఓవర్ రేట్ నేరాలకు సంబంధించి ఐపీఎల్ ప్రవర్తనా నియామవళి ప్రకారం ఈ సీజన్ లో జట్టు చేసిన మొదటి నేరం కావడంతో కేఎల్ రాహుల్ కు(KL Rahul Fine) తక్కువ శిక్ష విధించినట్లు తెలిపింది ఐపీఎల్. లేక పోతే భారీగా ఫైన్ వేసే వాళ్లమని పేర్కొంది. ఐపీఎల్ గేమ్ లు 3 గంటల 20 నిమిషాల్లో పూర్తి చేయాలని రూల్. కానీ నాలుగు గంటలు దాటుతున్నాయి.
Also Read : చితక్కొట్టిన కోహ్లీ దంచికొట్టిన డుప్లెసిస్