P Chidambaram : రాజస్థాన్ సంక్షోభం టీ కప్పులో తుపాను
సచిన్ కు ఎమ్మెల్యేల మద్దతుపై చెప్పలేం
P Chidambaram : కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పి.చిదంబరం షాకింగ్ కామెంట్స్ చేశారు. రాజస్థాన్ సంక్షోభం విషయంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సచిన్ పైలట్ కు ఎంత మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నారో తెలియదని పేర్కొన్నారు.
రాజకీయాలలో సంక్షోభం అన్నది సర్వ సాధారణమైన విషయమని స్పష్టం చేశారు. మరో వైపు రాష్ట్రంలో 90 మందికి పైగా ఎమ్మెల్యేలు బేషరతుగా సీఎం అశోక్ గెహ్లాట్ కు మద్దతు ఇస్తున్నారు.
దీనిని దృష్టిలో పెట్టుకుని పి. చిదంబరం(P Chidambaram) కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంతో అపారమైన అనుభవం కలిగిన నాయకుడిగా అశోక్ గెహ్లాట్ కు పేరుంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సంక్షోభాన్ని నివారించే సత్తా సీఎంకు ఉందని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
ఇదే సమయంలో రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అశోక్ గెహ్లాట్ కొనసాగడం ఖాయమని కుండ బద్దలు కొట్టారు. ఇదిలా ఉండగా దేశంలో కేవలం రెండు రాష్ట్రాలలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వాలు కొలువు తీరాయి.
ఇదిలా ఉండగా అశోక్ గెహ్లాట్(Ashok Gehlot) పై ప్రశంసలు కురిపించారు పి. చిదంబరం. ఆయనపై ఎటువంటి నిందలు వేయకూడదన్నారు. గెహ్లాట్ ఎప్పటికీ విధేయుడిగా ఉండే గట్టి కాంగ్రెస్ వాది అని స్పష్టం చేశారు.
రాజస్థాన్ లో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి ఇప్పటికే సీఎం పార్టీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీకి(Sonia Gandhi) క్షమాపణలు కూడా చెప్పారని, ఇక సమస్య సమిసి పోయినట్లేనని అన్నారు. ఇదే సమయంలో సీఎం పదవిని ఆశించిన సచిన్ పైలట్ కు ఎంత మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నారనేది తనకు తెలియదన్నారు.
Also Read : కాంగ్రెస్ పార్టీ చీఫ్ బరిలో మల్లికార్జున్ ఖర్గే